Begin typing your search above and press return to search.
తాలిబన్ల వెబ్ సైట్స్ మిస్సింగ్ .. కారణం ఏంటి
By: Tupaki Desk | 21 Aug 2021 1:30 PM GMTఆఫ్ఘనిస్థాన్ లో పాతుకుపోయిన తాలిబన్లను నిర్మూలించలేక అమెరికా నిష్క్రమిస్తోంది. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా సేనల ప్రాబల్యం కొనసాగినంతకాలం తాలిబన్లు పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ బాణి వినిపించేవారు. తీవ్ర భావజాల వ్యాప్తికి వెబ్, సోషల్ మీడియా మాధ్యమాలను వారు వినియోగించుకునేవారు. అయితే, ఆఫ్ఘన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తాలిబన్ల ఖాతాలను నిషేధించాయి.
ఈ క్రమంలో, నిన్నటి నుంచి తాలిబన్ వెబ్ సైట్లు కూడా మూగబోయాయి. తాలిబన్లు ప్రధానంగా ఐదు భాషల్లో వెబ్ సైట్ల ద్వారా తమ భావజాల వ్యాప్తి, ప్రకటనలు చేస్తుంటారు. పష్తో, ఉర్దు, అరబిక్, ఇంగ్లీషు, దరీ భాషల్లో తాలిబన్లు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్లు శుక్రవారం నుంచి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయాయి.
క్లౌడ్ ఫ్లేర్ సంస్థ ఈ వెబ్ సైట్ల హోస్టింగ్ కార్యకలాపాలు చేపడుతుండగా, మీడియా ప్రతినిధులు ఆ సంస్థను సంప్రదించగా, సరైన స్పందన రాలేదు. తాలిబన్ల వెబ్ సైట్ల కార్యకలాపాలు నిలిచిపోవడం మంచి పరిణామమేనని మీడియా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాలిబన్లు తమ భావజాలంతో ప్రజలనే కాకుండా అల్ ఖైదా, తదితర అతివాద ఇస్లామిక్ సంస్థలను కూడా ప్రేరేపించగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా-శాన్ ఫ్రాన్సిస్కో లోని 'క్లౌడ్ ఫ్లేర్' అనే సంస్థ ఈ సైట్స్ కి రక్షణ కల్పిస్తుంటుంది. వీటిని ఎవరు నిర్వహిస్తున్నారో ప్రజలకు తెలియకుండా ఈ సంస్థ కాపాడుతుంటుంది. అయితే ఇంటర్నెట్ నుంచి ఇవి ఎందుకు మిస్సయ్యాయో తెలిపేందుకు ఈ సంస్థ మహిళా అధికార ప్రతినిధి నిరాకరించారు. ఈ-మెయిల్స్ కి గానీ, ఫోన్ కాల్స్ కి గానీ స్పందించేందుకు నిరాకరించారు. ఈ సైట్ల మిస్సింగ్ గురించి వాషింగ్టన్ పోస్ట్ ఓ వార్తను ప్రచురించింది. తాలిబన్లే వీటిని అర్ధాంతరంగా నిలిపివేశారా అన్న విషయం కూడా వెల్లడి కాలేదు.
తాలిబన్ ఉగ్రవాదులు నిర్వహిస్తున్న వివిద వాట్సాట్ప్ గ్రూపులు కొన్ని తాత్కాలికంగా బ్లాక్ చెయ్యడం వెనుక ఆ సంస్థ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడలు ఏమైనా ఉన్నాయా , అనే విషయం అంతు చిక్కడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. తాలిబన్ నిర్వహిస్తున్న కొన్ని వాట్సాప్ గ్రూపులు బ్లాక్ అయ్యాయని ఉగ్రవాదుల మీద నిఘా వేసిన సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కాట్స్ అంటున్నారు. తాలిబన్లు నిర్వహిస్తున్న వెబ్ సైట్లు తాత్కాలికంగా బ్రేక్ పడటానికి అమెరికా చట్టాలు కారణం అని కొందరు నిపుణులు అంటున్నారు.
అఫ్గానిస్తాన్ లో పాతుకుపోయిన తాలిబన్లు కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. 20 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. 10 సంవత్సరాల క్రితం తాలిబన్లు వేరు. ఇప్పుడు తాలిబన్లు వేరు అని ఆ సంస్థ ఉగ్రవాదులు నిరూపించుకుంటున్నారు. మారుతున్న టెక్నాలజీకి మేము ఏమీ తక్కువ కాదని తాలిబన్లు వారి వెబ్ సైట్లు నిర్వహిస్తూ వారి తీరును నిరూపించుకుంటున్నారు. అఫ్గానిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారికంగా ఐదు బాషల వెబ్ సైట్లు నిర్వహించాలని తాలిబన్లు పక్కాప్లాన్ వేసుకున్నారని సమాచారం