Begin typing your search above and press return to search.

అశ్లీల సైట్లు చెక్ చేస్తున్న తాలిబన్లు.. కారణమిదే

By:  Tupaki Desk   |   4 Sep 2021 4:47 AM GMT
అశ్లీల సైట్లు చెక్ చేస్తున్న తాలిబన్లు.. కారణమిదే
X
అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళల విషయంలో దారుణాలకు పాల్పడుతున్నారు. బయట కనిపిస్తే చాలు విరుచుకుపడుతున్నారు. తాజాగా తాలిబన్ల చూపు పోర్న్ సైట్ల మీద పడింది. తమ దేశం పరిధిలో వచ్చే పోర్న్ సైట్లను వారు ప్రత్యేకంగా వీక్షిస్తున్నారట.. తాలిబన్లు సడెన్ గా పోర్న్ సైట్ల మీద ఎందుకు పడ్డారన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే వాటిల్లో నటించిన అప్ఘనిస్తాన్ మహిళలను చంపడానికి అశ్లీల చిత్రాలు చూస్తున్నారని తెలిసింది.

అప్ఘనిస్తాన్ పాలనలో తాలిబన్ల నిషేధిత జాబితాల్లో పోర్న్ ఒకటి. మగవాళ్లు పోర్న్ వీక్షించడాన్ని షరియా చట్టం అభ్యంతరం చెప్పదు కానీ.. ఆడవాళ్లు అందులో నటిస్తే మాత్రం సహించేది లేదని తాలిబన్లు అంటున్నారు. పోర్న్ సినిమాల్లో నటించిన అప్ఘన్ మహిళలను గుర్తించే పనిలో ఇప్పుడు తాలిబన్లు పడ్డారట.. అందుకోసం వెబ్ సైట్లను చెక్ చేస్తున్నారట.. అలా చెక్ చేసి, నటించిన మహిళలను గుర్తించి వారిని వెతికి పట్టి చంపడం ప్రస్తుతం తాలిబన్లు పెట్టుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే తాలిబన్లు ప్రత్యేకంగా పోర్న్ సైట్లను చెక్ చేస్తున్నారట.. కేవలం పోర్న్ సినిమాల్లో నటించిన వారినే కాదు.. వేశ్యలను కూడా చంపడానికి తాలిబన్లు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

గత 20 ఏళ్లలో మారిన పరిస్థితుల దృష్ట్యా అప్ఘనిస్తాన్ లో వేశ్యలుగా పనిచేస్తున్న వాళ్లు, విదేశీయులతో కలిసి పోర్న్ సినిమాల్లో నటించిన వారు ఉన్నారని తాలిబన్లు గుర్తించారట.. ఇప్పుడు అలాంటివారందరినీ గుర్తించి చంపడమే వీరి పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

వేశ్యలను వదిలే ప్రసక్తే లేదని.. వారిని చంపడమే పరిష్కారమని తాలిబన్లు భావిస్తున్నారట.. అయినా గత 20 ఏళ్ల పరిణామాల్లో అందరినీ క్షమించేసినట్టుగా తాలిబన్లు ఇది వరకూ ప్రకటించారు. అయితే ఇప్పుడు మాట మారుస్తూ తమ మార్క్ చూపిస్తున్నారు. మళ్లీ హింస, దుర్మార్గాలు మాత్రం ఆగేలా లేవు.

మీడియాకు తాలిబన్లు ఉక్కుపాదం మోపడంతో అక్కడ వాస్తవాలు బయటకు రావడం లేదు. తాలిబన్లు దుర్మార్గాలకు తెగబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆఖరికి పొట్టకూటి కోసం పోర్న్ సినిమాల్లో నటించిన వారిని చంపుతుండడం తాలిబన్ల దుర్మార్గానికి పరాకాష్టగా మారింది.