Begin typing your search above and press return to search.

పల్లె వాతావరణం... పల్లెరుచులు నగరంలోనే!

By:  Tupaki Desk   |   1 April 2017 3:02 PM GMT
పల్లె వాతావరణం... పల్లెరుచులు నగరంలోనే!
X
భిన్నమైన... ఆకర్షణీయమైన పేరుతో... చక్కటి రుచులతో హైదీరాబాదీలను రుచులతో ముంచెత్తిన తాలింపు... ఏడాది తిరిగేలోపే నిజాంపేట్ క్రాస్ రోడ్డు(కూకట్ పల్లిలో)లో రెండో బ్రాంచ్ ను ప్రారంభించింది. తెలుగు భోజనాలను సరికొత్త పద్ధతిలో వడ్డించడమే కాకుండా... ఆరోగ్యకరమైన రాగి పాత్రలను వినియోగిస్తూ... కస్టమర్ల యొక్క జిహ్వ చాపల్యాన్ని తీరుస్తోంది. తెలుగు ప్రజలు గ్రామీణ నేపథ్య ప్రియులు కాబట్టి... గ్రామీణ వాతావరణం నేపథ్యం థీమ్ తో అలంకరించి... అలనాటి నటీనటుల చిత్రపటాలతో కనుల విందుగా... అలనాటి పాటలతో చెవులకు ఇంపుగా... తీర్చిదిద్దారు ‘తాలింపు’ హోటల్ ను. దీనిని తెలంగాణ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి ప్రారంభించారు.

ప్రముఖ హాస్యనటుడు, హీరో సప్తగిరి మాట్లాడుతూ ‘తెలుగు వాళ్లకు కామెడీ అన్నా... ఆహారం అన్నా ఎంతో ఇష్టం. ఈ రెండు బాగున్నంత కాలం బాగా ఆదరిస్తారు. నాకు ఇక్కడ వంటకాలన్నీ బాగా నచ్చాయి. తప్పకుండా తాలింపు హోటల్ ఆహార ప్రియుల మదిని దోచుకుంటుంది. ప్రస్తుతం నేను నాగచైతన్య కొత్త మూవీ ‘రారండోయ్.. వేడుకచూద్దాం’ సినిమాకు డబ్బింగ్ చెబుతూ బిజీగా వున్నా. నేను హీరోగా నటించబోయే తదుపరి చిత్రం మే 20వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది’ అన్నారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ‘హైదరాబాద్ వంటి పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన భోజనశాలలు ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రంగాన్ని వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో భావించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందిస్తే ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. తాలింపు యాజమాన్యం ఆ బాధ్యతతో నాణ్యమైన ఆహారం అందించి ప్రజలకు చేరువ అవుతుందని భావిస్తున్నాను. నాకు ఇక్కడ పులావ్.. భోజనాలు బాగా నచ్చాయి. తప్పకుండా అందరకీ నచ్చుతుందని’ అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గిద్దలూరు(ప్రకాశం జిల్లా) నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఐ.వి.రెడ్డి, తాలింపు హోటల్ నిర్వాహకులు సుబ్బారావు... చిమ్మల ప్రకాష్.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ దర్శకుడు అరుణ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.