Begin typing your search above and press return to search.
పవన్ కాన్సెప్ట్..ఎవరికీ తెలియకుండా మాట్లాడడం?
By: Tupaki Desk | 21 Dec 2016 11:30 AM GMTఒక ఊరి రాజుగారు మరో ఊరిలో భటుడితో సమానమట... పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. సినిమాల్లో సింహం రేంజి ఉన్న పవన్ పాలిటిక్సులోనూ అంతేస్థాయిలో ఉంటారని మొదట్లో భావించినా ఆయన రేంజి మాత్రం రోజురోజుకీ పడిపోతోంది. రాజకీయాల్లో కొత్తదనం తేవాలన్నది పనవ్ ప్రయత్నమే కావొచ్చు కానీ... అదే సమయంలో ‘బీ ఏ రోమన్ ఇన్ రోమ్’ అన్నట్లుగా ఉండాలన్నది పవన్ మరచిపోయినట్లుగా కనిపిస్తోంది. రాజకీయ నేతలు ఎలా పబ్లిసిటీ వస్తుందా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. తాము మాట్లాడింది మంచైనా, చెడైనా జనంలోకి వెళ్లాలనుకుంటారు. కానీ.. పవన్ మాత్రం అందుకు భిన్నంగా జనాలకు పట్టని మార్గంలో వెళ్తున్నారు.
పవన్ కళ్యాన్ రోజుకో ట్వీట్ చొప్పున ట్విట్టర్ లో ఏదో ఒకటి పోస్టు చేస్తున్నారు. అవి ఇప్పటికే పట్టించుకోవడం మానేసిన మీడియాల్లో చిన్నచిన్న సింగిల్ కాలమ్సుగా వస్తున్నాయి. దీంతో పవన్ క్రమంగా తెర వెనక్కుపోతున్నారు. సభలు - సమావేశాలు, - ప్రెస్ మీట్లు పెడితే ఖర్చనుకున్నా కనీసం సోషల్ మీడియాలో పాపులర్ మీడియాను ఆయన ఎంచుకున్నా బాగుండేది. తెలుగు రాష్ట్రాల్లో ట్విట్టర్ ను రెగ్యులర్ గా వారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ఏమాత్రం ఆదరణ లేని ఆ మాధ్యమాన్ని పవన్ ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. జాతీయ స్థాయిలో నేతలంతా ట్విటర్లోనే ఎక్కువగా ఉంటున్నా... ఏపీలో మాత్రం ట్విట్టర్ వాడే ప్రజలు చాలా తక్కువ. ఫేస్ బుక్ అయితే ఓకే.. పవన్ అభిమానించే కుర్రాళ్లంతా క్లాస్ బుక్స్ పట్టకపోయినా ఫేస్ బుక్ ను మాత్రం వదలరు. అలాంటివారికి రీచవ్వాలంటే పవన్ ఫేస్ బుక్ లో లైవ్ ఇవ్వడం.. అఫీషియల్ పొలిటికల్ పేజీ క్రియేట్ చేసి అందులో పోస్టు చేయడం చేస్తే బాగుంటుంది. కానీ.. పవన్ మాత్రం ఇదేమీ పట్టకుండా డైలీ సీరియల్ లా రోజుకో ముక్క ట్వీట్ చేస్తుంటే ఎవరికీ రీచవ్వడం లేదు.
పవన్ బహిరంగ సభలు పెట్టి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తేనే ప్రభుత్వం రెస్పాండు కాలేదు... బిజెపి అయితే అఫీషియల్ గానే ఆర్డరు పాస్ చేసింది.. ఆయన్ను ఏమాత్రం పట్టించుకోవద్దని క్యాడర్ కు ఆదేశాలిచ్చింది. అంత ప్రతికూలత ఉన్నప్పుడు ట్వీట్లతో పవన్ ఏం సాధిస్తారో ఎవరికీ అర్థం కాని అంశం. పవన్ బయటకొస్తే జనం వెంట వస్తారని.. అలా చేయడం మానేసి ఎవరికీ పట్టని రూట్లో వెళ్లడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘నాక్కొంచెం తిక్కుంది’ అన్న ఆయన డైలాగునే గుర్తు చేసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/