Begin typing your search above and press return to search.
తమన్ వీడియ్ ఏమో కానీ జగన్ సర్కారును దెబ్బేసిందే
By: Tupaki Desk | 16 July 2022 4:34 AM GMTఏపీ రోడ్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాటల్ని వేలెత్తి చూపించి మరీ కడిగేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నప్పటికీ.. పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు చేసే ప్రభుత్వం.. సగటు జీవికి అవసరమైన రోడ్లు.. విద్య.. వైద్యం లాంటి ప్రాథమిక అంశాలతో పాటు.. మౌలిక వసతుల్లో మార్పులు చోటు చేసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
జులై 15 నాటికి ఏపీలోని రోడ్లలో 8వేల కి.మీ. మేర అద్దాల మాదిరి తయారు చేస్తానంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి చెప్పిన తేదీ చెప్పినా.. ఏపీ రోడ్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదన్న గుస్సా వ్యక్తమవుతోంది.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన జనసైనికులు రెట్టించిన ఉత్సాహంతో.. ఏపీ వ్యాప్తంగా ఉన్న గలీజు రోడ్ల ఫోటోల్ని పోస్టు చేశారు. మరికొందరు వీడియోలను పెట్టారు. ఇంకొందరు మీమ్స్ ను సిద్ధం చేసి మరీ పంపారు.దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ సంచలనంగా మారటమే కాదు.. ట్రెండింగ్ లో నడిచింది.
ఒకవైపు ఈ వివాదం ఇలా నడుస్తుంటే.. మరోవైపు ప్రముఖ సంగీత దర్శకులు థమన్ తన కారులో రాజమండ్రి నుంచి భీమవరం వెళుతున్న వైనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా రోడ్ల మీద ఉన్న గుంతలతో ఆయన ఇబ్బంది పడుతున్న వైనాన్ని చెప్పేశారు. ఆయన ఈ వీడియోను షూట్ చేసుకునే వేళలో.. రోడ్ల మీద ఉన్న గుంతలతో ఆయన సకారు నడుపుతూ పడిన ఇబ్బంది కళ్లకు కట్టినట్లుగా ఉంది.
ఈ వీడియోను టీడీపీ.. జనసేన నేతలతో పాటు.. పలు మీడియా సంస్థలు సైతం దీనిపై కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో సదరు వీడియో చేయకపోయినప్పటికీ.. తమన్ వీడియో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మొత్తంగా థమన్ వీడియో ఏమో కానీ.. రోడ్ల మీద ఉన్న గుంతలపై నుంచి కారును నడిపే వేళలో అతగాడు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని వీడియో చూస్తున్న తెలుగు ప్రజలు థమన్ ను అభినందిస్తున్నారు.మరోవైపు ఈ వీడియో ఏపీ ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. తాము ఇరుకున పడటానికి కారణమైన థమన్ పై వైసీపీ నేతలు గుస్సా అవుతున్నట్లు చెబుతున్నారు.