Begin typing your search above and press return to search.

తమ్మూ.. ఆ కౌంటర్ ఎవరికమ్మా!!

By:  Tupaki Desk   |   15 March 2016 9:30 AM GMT
తమ్మూ.. ఆ కౌంటర్ ఎవరికమ్మా!!
X
స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న హీరో హీరోయిన్లు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకునే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. కంగనా లాంటి కొందరు తప్ప, అంత ఈజీగా నోరు విప్పరు. పైగా సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన భామలు.. అక్కడ వీలైనంత వరకూ సైలెంట్ గానే ఉంటారు. అంతే తప్ప.. టాప్ రేంజ్ లో ఉన్నోళ్లపై సెటైర్స్ వేసేంత సాహసం చేయరు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా హఠాత్తుగా సెన్సేషనల్ కామెంట్స్ చేసేసింది.

' సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌ మీద కన్నేస్తే, అక్కడున్న వారు హాలీవుడ్‌ మీద దృష్టి పెడుతున్నారు. ఆఫర్ అందుకుంటే అన్ని భాషల్లో చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఏ సినిమా చేసినా దానికి న్యాయం చేయడం ముఖ్యం.' అంటూ కామెంట్స్ చేసింది తమన్నా. అంతే కాదు.. తనకు మాత్రం అలాంటి ఆలోచనలేమీ లేవన్నది తమ్మూ ఉవాచ.

ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీలో దీపికా పదుకొనే - ప్రియాంకా చోప్రాలు వరుస హాలీవుడ్‌ సినిమాలు చేస్తున్నారు. వాళ్లకు సెటైర్ వేస్తూనే తమన్నా ఇలాంటి కామెంట్స్ చేసిందనే బాలీవుడ్‌ జనాలు అంటున్నారు. తనకు అలాంటి ఆలోచనలు లేకపోతే.. ఇలాంటివి చెప్పడం ఎందుకన్నది అసలు ప్రశ్న. ఏమైనా.. బాలీవుడ్ బాగానే వంటబట్టింది మిల్కీకి. ఎప్పుడూ ఏదో ఒకలా వార్తల్లో నానాలంటే.. ఇలాంటివి చేయాల్సిందే అక్కడ. బాలీవుడ్ లో అంతే..