Begin typing your search above and press return to search.

ఎన్నికల బ‌రిలో త‌మ‌న్నా... కార‌ణ‌మేంటి?

By:  Tupaki Desk   |   25 March 2019 11:35 AM GMT
ఎన్నికల బ‌రిలో త‌మ‌న్నా... కార‌ణ‌మేంటి?
X
మంగ‌ళ‌గిరి 2014కు ముందు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది ఒక‌టి. ఇపుడు అది రాష్ట్రంలో ఒక స్పెష‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. మంగ‌ళ‌గిరి అమరావ‌తిలో కీల‌క ప్రాంతం కావ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఇపుడు ఇక్క‌డి నుంచే ఏపీ ముఖ్య‌మంత్రి కుమారుడు నారా లోకేష్ కూడా పోటీ చేస్తుండ‌టంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.

గ‌తంలో ఇక్క‌డ వైసీపీ నుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గెలిచారు. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ... అత‌ను మాత్రం పార్టీకి విధేయుడిగా ఉన్నారు. పేద‌ల‌కు సొంత డ‌బ్బుల‌తో కొన్ని ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌లోభాల‌కు లొంగ లేదు. దీంతో మ‌ళ్లీ అత‌నే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మొద‌ట్లో జ‌న‌సేన పొత్తులో భాగంగా సీపీఐ ఇక్క‌డ పోటీకి దిగింది. అయితే క‌మ్యూనిస్టుల‌కు షాకిస్తూ జ‌న‌సేన అభ్య‌ర్థిని ఇక్క‌డ ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

అయితే, ఇక్క‌డ మ‌రో విశేషం చోటు చేసుకుంది. శ్రీ‌రెడ్డి ఇష్యూ స‌మ‌యంలో జ‌నాల‌కు ప‌రిచ‌యం అయిన ట్రాన్స్ జెండర్ తమన్నా బరిలోకి దిగుతున్నారు. ఆమె బాగా నోటెడ్ ప‌ర్స‌న్ కావ‌డంతో ఓట్ల చీలిక జ‌రుగుతుంద‌ని అంటున్నారు. అది జ‌రిగేది కొంత‌మేర‌కే అయినా దాని ప్ర‌భావం ఎవ‌రిపై ప‌డుతుందో తెలియ‌దు. ఈమెను జ‌స్ట్ ట్రాన్స్‌జెండ‌ర్‌ గా చూడ‌లేం. సోషల్ యాక్టివిస్ట్ గా ట్రాన్స్‌ జెండర్ల సమస్యల పరిష్కారం కోసం ఆమె పోరాడుతున్నారు. ఆమె తొలుత జ‌న‌సేన టిక్కెట్ ఆశించినా ఆమెకు ఇవ్వ‌లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ప‌వ‌న్ విష‌యంలో చింతమనేని పై సవాల్ విసిరిన‌పుడు కూడా ఆమె వైర‌ల్ అయ్యారు. చింతమనేని పై పోటీ కి దిగుతాన‌ని చెప్పి చివ‌ర‌కు ఆయ‌న బాస్ లోకేష్‌ పై దిగుతోంది. మొత్తానికి ఎవ‌రికి వారు ప్ర‌త్యేక కార‌ణాల‌తో ఇక్క‌డ హ‌డావుడి చేస్తున్నారు.

అయితే... ఇక్క‌డికి ఎంత మంది వ‌చ్చి పోటీ చేసినా... గెలిచి తీరుతాన‌ని వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి స‌వాల్ చేస్తున్నారు. ఆయ‌న స్వ‌యానా రైతు. ఇక్క‌డ అంద‌రికీ వ్య‌క్తిగ‌తంగా తెలిసిన మనిషి.