Begin typing your search above and press return to search.
తమన్నా టార్గెట్ లోకేషే.. ఎందుకంటే?
By: Tupaki Desk | 27 March 2019 6:38 AM GMTమంగళగిరి.. ఇప్పుడు అందరి దృష్టి ఈ నియోజకవర్గం మీదే.. ఎందుకంటే ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగని ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, చినబాబు లోకేష్ బాబు మంగళగిరి నుంచి అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగారు. తొలి ప్రత్యక్ష పోటీలో లోకేష్ గెలుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. లోకేష్ ఓడితే టీడీపీ పరువు పోతుంది. అందుకే టీడీపీ ఫుల్ ఫోకస్ మంగళగిరిలో పెట్టింది. అయితే అనూహ్యంగా లోకేష్ పై పోటీకి తమన్నా వచ్చింది. ఈ ట్రాన్స్ జెండర్ 25న చివరి రోజున దాఖలు చేసిన నామినేషన్ ను తాజాగా అధికారులు ఓకే చేశారు. దీంతో లోకేష్ పై తమన్నా పోటీ ఖాయమైంది. లోకేష్ ను ఓడిస్తానని శపథం చేసిన తమన్నా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
లోకేష్ ను తమన్నా టార్గెట్ చేసుకొని పోటీచేయడంతో ఇక్కడ టీడీపీ ఇరుకునపడుతోంది. ట్రాన్స్ జెండర్ బరిలోకి దిగుతుండడంతో లోకేష్ బాబు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొదట జనసేన టికెట్ పై బరిలోకి దిగాలని తమన్నా తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పవన్ టికెట్ నిరాకరించడంతో చివరకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి బరిలో నిలిచింది. ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తానని తమన్నా చెబుతోంది. లోకేష్ బాబు టార్గెట్ గా ప్రచారం చేస్తానని ప్రకటించింది.
తమన్నా సామాజిక విప్లవకారిణీగా వివిధ సమస్యలపై పోరాడుతుంటారు. శ్రీరెడ్డి వివాదంలోనూ యాక్టివ్ గా స్పందించారు. హైదరాబాద్ లో మహిళల సమస్యలపై పోరాడుతుంటారు. ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తోంది.
నామినేషన్ ఓకే అయిన సందర్భంగా తమన్నా హర్షం వ్యక్తం చేసింది. లోకేష్ బాబు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాల్సిందని ఆరోపించారు. వైసీపీ , ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేయని తమన్నా.. నారా లోకేష్ అనేసరికి మాత్రం విరుచుకుపడుతోంది.. వారసత్వ రాజకీయాలను ప్రజలు ఒప్పుకోవద్దని కోరుతోంది. తమన్నా ఎంట్రీతో మంగళగిరిలో లోకేష్ బాబు ఇరుకుపడుతున్నారు. ఆమె గనుక ప్రచారపర్వంలోకి దిగితే మరిన్ని ఇబ్బందులు లోకేష్ కు తప్పేలా లేవు.