Begin typing your search above and press return to search.
కలకలం రేపుతున్న తమిళ క్యాలెండర్
By: Tupaki Desk | 7 Dec 2016 6:06 AM GMTఅమ్మగా తమిళుల మనసుల్లో నిలిచిపోయిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు తమిళనాట కలకలంగా మారింది. అమ్మ మరణాన్ని ఏడాది కంటే ముందే డిసైడ్ చేసేసినట్లుగా సదరు క్యాలెండర్ చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యాదృశ్చికంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఒక క్యాలెండర్ కీలకంగా మారింది.
ఒక ప్రముఖ షాపు ప్రతి ఏటా ముద్రించే క్యాలెండర్ ను ఈ ఏడాది యథావిధిగా ముద్రించింది. ఈ క్యాలెండర్లో తేదీ కిందనే.. ఆ రోజుకు ఒక సూక్తిని కానీ నీతి వాక్యాన్ని కానీ ముద్రిస్తారు. చిత్రంగా.. అమ్మ మరణించిన డిసెంబరు 5 తేదీన ఈ క్యాలెండర్ లో తేదీ కింద.. ‘‘ఓ గదిలో మరణం.. పక్కగదిలో వారసత్వ కోట్లాట’’ అని ప్రింట్ అయ్యింది.
అమ్మ మరణంతో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలకు సరిపోయేలా ఉన్న ఈ వాక్యం తమిళుల దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆసక్తికర చర్చ సాగుతోంది. అపోలో లోని ఐసీయూలో అమ్మకు అంతిమ ఘడియల వేళ.. ఆమె తర్వాత ఎవరు పగ్గాలు చేపట్టాలన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. దీనిపై పార్టీలో భారీగా కసరత్తులు జరిగి.. చివరకు పన్నీరు సెల్వాన్నిముఖ్యమంత్రిగా ఎంపిక చేయటం తెలిసిందే.
అపోలో ఆసుపత్రిలోని ఒక గదిలో అమ్మ శాశ్విత నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ.. దానికి దగ్గర్లోని గదిలో అమ్మ పార్టీకి చెందిన నేతలు జయ వారసుడిని డిసైడ్ చేసేందుకు పడిన వైనం.. క్యాలెండర్ లో చెప్పినట్లే ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ క్యాలెండర్ ముచ్చట ఇప్పుడు ఆన్ లైన్లో వైరల్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/