Begin typing your search above and press return to search.
సహాయనటిని దారుణంగా హతమార్చిన సినీ దర్శకుడు!
By: Tupaki Desk | 7 Feb 2019 5:43 AM GMTదారుణం వెలుగు చూసింది. కోలీవుడ్ కి చెందిన సహాయ నటిని ఆమె భర్త అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం బయటకు వచ్చింది. సదరు సహాయ నటి భర్త సైతం సినీ పరిశ్రమకు చెందిన వాడే. సంచలనంగా మారిన ఈ హత్యోదంతంలోకి వెళితే.. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పలో గుర్తు తెలియని యువతికి చెందిన రెండు కాళ్లు.. ఒక చేతిని గత నెల 21న పోలీసులు గుర్తించారు.
సదరు యువతి ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు పలుచోట్ల వెతికారు. ఇదిలా ఉండగా.. చెన్నై ఈక్కాడుతాంగల్ లో నివసించే కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ కు చెందిన 38 ఏళ్ల సంధ్య అనే యువతి గడిచిన కొద్ది రోజులుగా కనిపించటం లేదన్న మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది.
సదరు మిస్సింగ్ అయిన మహిళ భర్త సినీ దర్శకుడు బాలకృష్ణన్ గా గుర్తించారు. ప్రాధమికంగా అడిగిన ప్రశ్నలతో పోలీసులకు అనుమానం కలిగింది. బాలకృష్ణన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణను షురూ చేసినంతనే వివరాలన్ని ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. తన భార్య సంధ్య సహాయ నటిగా పనిచేస్తుందని చెప్పిన అతను.. తాను ఆమెను అమానుషంగా హత్య చేసినట్లుగా పేర్కొన్నాడు.
భార్య భర్తలు ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ.. సంధ్య కొద్దికాలంగా వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఆమెను హత్య చేయటానికి కారణంగా తేల్చారు. రాత్రివేళల్లో సెల్ ఫోన్లో మాట్లాడటం.. బయటకు వెళ్లటం భార్యభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇరువురి మధ్య మనస్పర్థలు.. గొడవలు జరిగేవి. దీంతో.. ఇరువురు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తానుతన ప్రియుడితో ఉంటానంటూ సంథ్య వాదించటం..భార్యభర్తల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ విషయమై ఒకసారి ఇరువురు ఘర్షణ పడ్డారు. ఇలాంటి పరిస్థితిని ముందుగా ఊహించిన బాలకృష్ణన్ ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. కత్తితో ఆమెపై దాడికి దిగి.. ఆమానుషంగా ఆమెను పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె శరీర భాగాల్ని ముక్కలు..ముక్కల లెక్కన నరికేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. అలా చెత్తకుప్పలో దొరికిన కాళ్ల ఆధారంగా ఈ హత్య కేసును చేధించారు.