Begin typing your search above and press return to search.

లెగ్గింగ్స్ పై తమిళ పత్రిక దుమారం

By:  Tupaki Desk   |   23 Sep 2015 6:17 PM GMT
లెగ్గింగ్స్ పై తమిళ పత్రిక దుమారం
X
మహిళల దుస్తులపై అనుచిత వార్తలు ప్రచురించిన ఓ వారపత్రిక వివాదాల్లోచిక్కుకుంది. స్త్రీలు దరిస్తున్న లెగ్గింగ్స్ భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తోందంటూతమిళనాడుకు చెందిన కుముదం పత్రిక రాసిన కథనం ఇపుడు సోషల్ మీడియాలసంచలనంగా మారి…..వివాదాలకు దారితీసింది.

కుముదం అనే వారపత్రిక యువతపై ప్రత్యేక కథనం రాసింది. యువత పెడదోవపడుతోందని….మహిళలు ధరించే లెగ్గింగ్స్ చాలా అసభ్యంగా ఉన్నాయంటూకథనం ప్రచురించింది. దీంతోపాటు లెగ్గిన్స్ తో కూడిన పలు ఫొటోలు కూడా వేసింది.కవర్ పేజీలో ఈ ఫొటోలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఈ పత్రిక క్లిప్ లనుపోస్ట్ చేస్తూ కుముదం పత్రిక తీరును విమర్శించారు. ఆ పత్రిక యాజమాన్యం,సంపాదకులు వెంటనే వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

మహిళల అనుమతి లేకుండా లెగ్గింగ్స్ వేసుకున్న ఫొటోలను ఎలా ప్రచురిస్తారంటూప్రశ్నిస్తున్నారు. పైగా అలాంటి ఫొటోలు కవర్ పేజీలో వేయడం ఏంటనిమండిపడుతున్నారు. అసభ్యత అనేది చూసే కళ్లల్లో ఉంటుందే తప్ప……ధరించేదుస్తుల్లో ఉండదంటూ స్పష్టం చేశారు. పత్రిక క్షమాపణ చెప్పాలని కోరుతూనే….స్కిన్ టైట్ వేసుకున్న ఫొటోలను వారికి పంపాలని సూచించారు.