Begin typing your search above and press return to search.

ఇదో ప్ర‌చారంః బాబు కాబోయే ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   19 March 2018 5:30 PM GMT
ఇదో ప్ర‌చారంః బాబు కాబోయే ప్ర‌ధాని
X
నాలుగేళ్లుగా సాగుతున్న దోస్తీకి బై బై చెప్తూ...ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు అనుకూలంగా ప్ర‌చారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో అయితే టీడీపీ శ్రేణులు త‌మ ప్ర‌చార దూకుడును కొన‌సాగిస్తున్నారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజాగా చంద్ర‌బాబు కాబోయే ప్ర‌ధాని అనే ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది. "అడుత్త ప్రథమర్ చంద్రబాబు నాయుడు?", అంటే ' కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు’ అంటూ.. ఒక ప్రముఖ తమిళ పత్రికలో వచ్చిన వార్తను - పోస్టర్ లు వేసి - తమిళనాడులో గోడలకి అతికిస్తున్నారు అక్కడి చంద్ర‌బాబు అభిమానులు.

స్థానికత విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడు ప్రజలు ఏకంగా 'కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు', అంటూ తమిళనాడులో పోస్టర్లు వేయ‌డంపై ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. అరవోళ్ళు అంత సామాన్యంగా పక్కన వాళ్ళని పొగడరని అలాంటి నేల‌మీద‌ పొరుగు రాష్ట్రం నాయ‌కుడు ప్ర‌ధాని కావాల‌నే ఫ్లెక్సీలు వెలువ‌డటం వెనుక ఉద్దేశ‌పూర్వ‌క ప్ర‌చారం ఉంద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. అయితే ఈ మధ్య చంద్రబాబు ప్ర‌క‌ట‌న‌లు - తమిళనాడులోని పత్రికలు - చానళ్లు పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురిస్తున్న తీరుతో కొంద‌రు ఇలా త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నార‌ని ఇంకొంద‌రు చెప్తున్నారు.