Begin typing your search above and press return to search.
చెన్నైలో అడ్డంగా బుక్ అయిన ఏపీ మంత్రి గంటా
By: Tupaki Desk | 10 Aug 2016 8:18 AM GMTఏపీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావుకు తమిళ మీడియా నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. ఒకానొక దశలో చిర్రెత్తుకొచ్చినా స్టేట్ మనది కాకపోవడంతో కంట్రోల్ అయిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే... కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని అన్ని వర్గాల ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి గంటా తమిళనాడులోని విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని ఆహ్వానించేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లారు.
అయితే, ఆ రాష్ట్ర నేతలు ఇప్పటికే కొన్ని వారాలుగా ఏపీపై పెట్రోల్ మాదిరి మండిపడుతున్నారు. తమ రాష్ట్రానికి చెందిన 30 మంది కూలీలను ఏపీ పోలీసులు రేణిగుంటలో అన్యాయంగా అరెస్టు చేశారని, తమవారు కూలీలు కాదని, తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చామని చెప్పినా వినకుండా కుళ్లబొడిచి.. అదుపులోకి తీసుకున్నారని తమిళతంబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అటు సీఎం జయ లలిత, ఇటు కరుణానిధి సైతం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాలను సైతం సంధించారు. తమ వారు ఒట్టి అమాయకులను విడిచిపెట్టాలని కోరారు. ఈ కాక ఇంకా చల్లారని టైంలో మంత్రి గంటా ఆహ్వానాల పేరుతో చెన్నై కి వెళ్లేసరికి అక్కడి మీడియా ఆయనను చుట్టుముట్టి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఏ ఆధారాలతో తమిళనాడు కూలీలను అరెస్టు చేశారని జయ, సన్ టీవీ ప్రతినిధులు గంటాను ప్రశ్నించారు. దీంతో హతాశులైన మంత్రి.. ఏం చెప్పాలో తెలియక తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా మీడియా ప్రతినిధులు విడిచిపెట్టకుండా.. తమదైన శైలిలో మరోమారు గంటాపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆయన ఈ విషయం తన పరిధిలో లేదని చెప్పారు. దీంతో పోలారు నది చెక్ డ్యామ్ ఎత్తు పెంచడంపై కూడా ప్రశ్నలు సంధించారు. అలాంటివి తనను అడగవద్దు అంటూ ఆయన హడావుడిగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత గోపాలపురంలో కరుణానిధికి పుష్కర ఆహ్వానపత్రిక అందచేయగా, ఆయన కూడా ఇదే అంశాల గురించి ప్రస్తావించారు. దీంతో గంటా ఓర్నాయనో.. అనుకోక తప్పలేదని సమాచారం. మరి తమిళనాడులో మంత్రి గంటా అలా బుక్కయ్యారన్నమాట!