Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్టు రోడ్డు మీదే బోరున ఏడ్చేసిన అథ్లెట్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 9 Aug 2021 3:19 AM GMTఇప్పటివరకు జరిగిన ఒలింపిక్స్ తో పోలిస్తే.. తాజాగా టోక్యోలో ముగిసిన ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల ప్రదర్శన గతంతో పోలిస్తే చాలా మెరుగైందని చెప్పాలి. గతంలో మాదిరి వెళ్లామా? వచ్చామా? అన్నట్లుగా ఉండే చాలామంది క్రీడాకారుల ప్రదర్శనతో పోలిస్తే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ మాటకు వస్తే.. పలువురు క్రీడాకారులు పతకాన్ని సాధించే సత్తాను ప్రదర్శించి కూడా అనూహ్య రీతిలో ఓటమిపాలయ్యారు. అయితేనేం.. వారి కష్టం ఊరికే పోలేదు. ఓడినప్పటికి మనసుల్ని గెలిచిన క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. తాజాగా అలాంటి సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి.. పతకాన్ని మిస్ అయిన తమిళనాడు అథ్లెట్ ధనలక్ష్మి. ఒలింపిక్స్‌లో 4x400 మీటర్ల మిక్సెడ్ రిలేలో ఆమె అద్భుత ప్రదర్శన చేసినప్పటికి విజయం సాధించలేకపోయింది. అయితేనేం.. ఆమె కష్టం ఊరికే పోకుండా.. తమిళ ప్రజల మనసుల్ని గెలిచేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా టోక్యో నుంచి తిరిగి వచ్చిన ఆమెకు.. తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.
అందరూ ఆమెను ప్రశంసిస్తున్నా.. ఆమె కళ్లు మాత్రం ఒకరి కోసం వెతుకుతున్నాయి. ఆమె ఆరాటాన్ని గమనించిన ధనలక్ష్మి బంధువు ఒకరు వచ్చి.. ఆమె చెవిలో ఆ విషయాన్ని చెప్పేశారు. అప్పటివరకు ధీమాగా ఉన్న ఆమె ఒక్కసారిగా బేలగా మారింది. ఎయిర్ పోర్టు రోడ్డు మీదనే కూలబడి రోదించసాగింది.అసలు విషయం తెలిసిన వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక తల్లిడిల్లారు. ఇంతకూ జరిగిందేమంటే.. ధనలక్ష్మికి అండగా నిలుస్తూ.. ఆమె ఆటకు దన్నుగా ఉండే ఆమె అక్క అనారోగ్యం కారణంగా మరణించిన విషయం ఆమెకు తాజాగా తెలిసిందే.
వాస్తవానికి ధనలక్ష్మి సోదరి.. ఆమె ఒలింపిక్స్ లో పాల్గొనటం కోసం టోక్యోకు వెళ్లటానికి ముందే జరిగింది. అయితే.. అక్క మరణం ఆమె ఆట మీద ప్రభావం చూపించకూడదన్న ఉద్దేశంతో.. ఆమెకు ఈ సమాచారాన్ని ఎవరూ ఇవ్వలేదు. ఆటలో మునిగిన ఆమె.. అందరూ బాగానే ఉన్నారనుకుంటూ ఉన్నారే తప్పించి.. తనను ఎంతో ప్రోత్సహించే అక్కడ శాశ్వితంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వైనం తెలుసుకొని గుండెలు పగిలేలా రోదించింది.
క్రీడాకారిణిగా ధనలక్ష్మి సక్సెస్ వెనుక.. ఆమె కష్టం దాగి ఉంది. పుట్టెడు పేదరికం నుంచి ఆత్మవిశ్వాసంతో.. సొంతంగా పడిన కష్టంతో పైకి వచ్చింది. ఆమె తల్లి ఇళ్లల్లో పని చేస్తూ పిల్లల్ని పెద్ద చేసింది. తండ్రి ఆమె చిన్నతనంలోనే మరణించటంతో.. తల్లి పిల్లల బాధ్యతను చేపట్టింది. కష్టపడి పెంచుతూ.. వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తనకు తాను తీవ్రంగా శ్రమించింది. ధనలక్ష్మి సోదరి గాయత్రి జులై 12నే మరణించారు.
అప్పటికి ఆమె పాటియాలాలో ప్రాక్టీస్ లో ఉన్నారు. ఆగస్టు 23న ఆమె టోక్యోకు పయనమయ్యారు. ఆమె ఎంతగానో ప్రేమించే ఆమె అక్క మరణం ధనలక్ష్మి మీద ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో ఆమెకు ఆ విషాద సమాచారాన్ని అందించలేదు. సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 100 మీటర్ల లో క్వీన్ ఆఫ్ ట్రాక్ గా పేరున్న ద్యుతి చంద్ పై ధనలక్ష్మి గెలవటంతో ఆమె పేరు మారుమోగింది. అంతేకాదు.. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భాగంగా మార్చి 18న జరిగిన 200 మీటర్ల సెమీ ఫైనల్లో అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ సందర్భంగా 1998లో పీటీ ఉష నెలకొల్పిన 22.30 సెకన్ల రికార్డును బద్ధలు కొట్టింది. ఆటతో అందరిన మనసుల్ని దోచుకున్న ఆమెకు.. అనుకోని కష్టం ఎదురైంది. ఆమె కోలుకొని మరిన్ని విజయాల్ని సొంతం చేసుకొని.. అక్క కలల్నినిజం చేయాలని ఆశిద్దాం.