Begin typing your search above and press return to search.
ముస్లిం ఫత్వాకు భయపడిన రాందేవ్ బాబా
By: Tupaki Desk | 31 Dec 2015 9:23 AM GMTప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఉత్పత్తులపై తమిళనాడుకు చెందిన తౌహీద్ జమాత్ సంస్థ ఫత్వా చేసిన సంగతి తెలిసిందే. పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం వినియోగిస్తున్నారని.. అందుకే.. ఆ ఉత్పత్తుల్ని వినియోగించకూడదని.. వాటిని బహిష్కరించాలంటూ ఫత్వా జారీ చేయటం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం కలకలాన్ని రేపింది.
తమ అయుర్వేద ఉత్పత్తుల్లో తౌహీద్ జమాత్ సంస్థ పేర్కొన్న విధంగా గోమూత్రం వినియోగించటం లేదని పతంజలి కంపెనీ స్పష్టం చేసింది. తమ మొత్తం 700 పైగా ఉత్పత్తుల్లో కేవలం ఐదు ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రం వినియోగిస్తామని.. ఆ ఉత్పత్తుల వివరాల్ని స్పష్టంగా పేర్కొంటున్నట్లు పతంజలి సంస్థ స్పష్టం చేసింది. అవగాహనా లోపంతో పొరపాటుగా ఫత్వా జారీ చేసి ఉంటారన్న అభిప్రాయాన్ని బాబా రాందేవ్ శిష్యుడు బాలకృష్ణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలే కానీ.. ఫత్వాలు జారీ చేయటమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.