Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః చిన్న‌మ్మ‌కే ప‌గ్గాలు

By:  Tupaki Desk   |   15 Dec 2016 3:13 PM IST
అఫిషియ‌ల్ః చిన్న‌మ్మ‌కే ప‌గ్గాలు
X
అన్నా డీఎంకే రాజ‌కీయ వార‌స‌త్వం విష‌యంలో ఊహించిందే జ‌రిగింది. పార్టీ ప‌గ్గాలు జ‌య‌ల‌లిత నెచ్చెలి చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కే ద‌క్కాయి. ఈ విష‌యాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ‌కు పార్టీలో ఎలాంటి హోదా లేని విష‌యం తెలిసిందే. అయితే ఆమెను ఏకంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పీఠంపై కూర్చోబెట్ట‌డానికి అవ‌స‌ర‌మైతే నిబంధ‌న‌ల‌ను కూడా స‌వ‌రిస్తామ‌ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి పొన్నైయాన్ వెల్ల‌డించారు. అమ్మ ఆత్మ‌గా శ‌శిక‌ళ ప‌నిచేశార‌ని, అందుకే ఆమెకే పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అంద‌రం క‌లిసి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచీ పార్టీ - ప్ర‌భుత్వంలో శ‌శిక‌ళ పాత్ర‌పై చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప‌న్నీర్‌ సెల్వం ప‌దేప‌దే పోయెస్ గార్డెన్ వెళ్లి శ‌శిక‌ళ‌ను క‌ల‌వ‌డంతో.. అన‌ధికారికంగా ఆమెదే పెత్త‌న‌మ‌న్న అనుమానాలూ బ‌ల‌ప‌డ్డాయి. ఇప్పుడు పార్టీ నుంచే అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఇక పోయెస్ గార్డెన్‌ లో అమ్మ రాజ్యం స్థానంలో చిన్న‌మ్మ రాజ్యం రానుంద‌న్న‌ది స్ప‌ష్టమైందని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

మ‌రోవైపుఅమ్మగా కొలిచే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను దర్శించుకోవడానికి ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు చెన్నైలోని ఆమె నివాసమైన పోయెస్‌ గార్డెన్‌ కు లైను కట్టేవారు. ఆమె మృతి తర్వాత కూడా వారు పోయెస్‌ గార్డెన్‌ కు పోటెత్తుతున్నారు. ఈసారి మాత్రం చిన్నమ్మ శశికళ దర్శనానికి ఈ క్యూ లైన్లు సాగుతున్నా. అమ్మపై మాదిరే చిన్నమ్మపై కూడా భక్తిని చూపుతుండ‌టం ఆస‌క్తిక‌రం.

Like Us on FaceboTamil Nadu CM backs Sasikala to lead AIADMK after Jayalalithaaok : https://www.facebook.com/Tupakidotcom/