Begin typing your search above and press return to search.
ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. సీఎం ప్రకటన!
By: Tupaki Desk | 22 Oct 2020 5:32 PM GMTఈ కరోనా కష్టకాలంలో జనాలకు ఇప్పుడు అంత్యంత ముఖ్యమైన హామీ ఏంటో తెలుసా? ‘అదే కరోనా వ్యాక్సిన్’. అవును.. ఇప్పుడు ప్రజలకు ఎన్ని తాయిలాలు ఇచ్చినా కూడా వారిని సంతృప్తి పరచలేరు. యావత్ ప్రపంచాన్ని చుట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇవ్వడమే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న ఏకైక హామీ. అందుకే ఇప్పుడు పార్టీలు కూడా దాన్నే అస్త్రంగా మలిచాయి.
బీహార్ ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమను అధికారంలోకి తీసుకొస్తే ప్రజలకు ఉచితంగా ‘వ్యాక్సిన్’ అందజేస్తామని బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక ఇప్పుడు తమిళనాడు వంతు. వచ్చే సంవత్సరం ఆరంభంలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో తమను గెలిపిస్తే తాము కూడా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని అన్నాడీఎంకే పార్టీ సీఎం అభ్యర్థి, ప్రస్తుత తమిళనాడు సీఎం ఫళని స్వామి ప్రకటించారు.
బీజేపీ తాజాగా బీహార్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన వెంటనే తమిళనాడు సీఎం ఫళని స్వామి తమిళ ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ ప్రకటన చేయడం విశేషం.
కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాకముందే ఇలా పార్టీలన్నీ వ్యాక్సిన్ వెంటపడ్డాయి. వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నాయి. మరి ఈ హామీలను ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా? లేదా అన్నది వేచిచూడాలి.