Begin typing your search above and press return to search.

పవన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం !

By:  Tupaki Desk   |   30 March 2020 5:30 PM GMT
పవన్  విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం !
X
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీకి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తి పై తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి స్పందించారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో .. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ అమలు అవుతుంది.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు చేపల వేట నిమిత్తం తమిళనాడు వరకు వెళ్లారు. అయితే లాక్ డౌన్ విధించడంతో వారు చెన్నై హార్బర్ లో నిలిచిపోయారు. వారికి భోజనం, వసతి లేక అలమటిస్తున్న విషయం వారి కుటుంబ సభ్యుల ద్వారా జనసేన నేతలకు తెలిసింది.

ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చెప్పడం తో ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ, మత్స్యకారులకు తగిన సదుపాయాలు కల్పించి వారిని సంరక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రికి పవన్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన తమిళనాడు సీఎం ..ప్రియమైన పవన్ కల్యాణ్, మత్స్యకారుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖను ఆదేశించాం. వారిని మేం తప్పకుండా ఆదుకుంటాం. కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ లో బదులిచ్చారు.