Begin typing your search above and press return to search.
విడాకులకు రీజన్స్ తో పని లేదు
By: Tupaki Desk | 11 Aug 2016 6:44 AM GMTఇద్దరు వ్యక్తులు తమ వివాహ బంధానికి చెల్లుచీటి ఇచ్చుకోవాలని భావించి కోర్టును ఆశ్రయిస్తే... వారికి విడాకులు ఎందుకు ఇవ్వాలన్న కారణాలు వెతకాల్సిన అవసరం కోర్టులకు లేదన్న విషయాన్ని తాజాగా తమిళనాడు ఫ్యామిలీ హైకోర్టు తేల్చింది. భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని కోరుకున్నప్పుడు.. అందుకు ప్రత్యేక కారణాలు లేకపోవచ్చు. వారిద్దరి మధ్య బంధం సరిగా లేదని.. ఇరువురు కలిసి బతకటం సాధ్యం కాదని అనుకుంటే వారికి విడాకులు మంజూరు చేసేదుకు కారణాల్ని కోర్టు వెతకాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
తమిళనాడుకు చెందిన ఇద్దరు యువతీయువకులు 2013లోపెళ్లి చేసుకున్నారు. కానీ.. అభిప్రాయ బేధాలతో వారు 2014 నుంచి విడిగా ఉంటున్నారు. 2015లో వారు ఇరువురు విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నారు.
అయితే.. వారి విడాకులకు కారణం చెప్పలేదంటూ ఫ్యామిలీ కోర్టు వీరి విడాకుల్ని కొట్టేసింది. దీనిపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా కోర్టు ఈ కేసును పరిశీలించింది. విడాకుల పిటీషన్ దాఖలు చేయటానికి ఏడాది ముందు నుంచి వాళ్లు విడిగానే ఉంటున్నారు కాబట్టి.. వారిక కలిసి ఉండే అవకాశం లేదని.. వాళ్లకు విడాకులు మంజూరు చేయటం తప్ప వేరే మార్గం లేదని జడ్జిలు అభిప్రాయపడుతూ విడాకులు మంజూరు చేశారు. తాజా తీర్పు నేపథ్యంలో విడాకులు తీసుకోవాలంటే కచ్ఛితమైన కారణాలు కోర్టుకు చెప్పాల్సి ఉంటుందన్న వాదనలో పస లేదని తేలిపోవటంతో పాటు.. ఇరువురు వ్యక్తులు పరస్పరం విడాకులు కావాలని బలంగా కోరుకుంటే.. కోర్టులు వారి అభిప్రాయానికే విలువ ఇవ్వాల్సి ఉంటుందన్న విషయం తాజా ఉదంతంలో స్పష్టమైందని చెప్పాలి.