Begin typing your search above and press return to search.

టిక్ టాక్ యాప్ పై నిషేధం.!

By:  Tupaki Desk   |   14 Feb 2019 1:30 AM GMT
టిక్ టాక్ యాప్ పై నిషేధం.!
X
ఇప్పుడు మీడియా కన్నా సోషల్ మీడియా పవర్ ఫుల్ గా మారింది. ఏ తప్పు చేసినా సోషల్ మీడియాలో నేతలు, ప్రముఖుల్ని కడిగేస్తున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు విమర్శించుకోవడం.. తిట్టుకోవడం.. అశ్లీలంగా దూషించుకోవడం.. తప్పుడు ఆరోపణలు చేసుకోవడం.. వ్యక్తిగతంగా దెబ్బతీయడం ఇలా ఫేక్ న్యూస్ కు స్వర్గధామంగా సోషల్ మీడియా మారింది.

ముఖ్యంగా ఫేస్ బుక్ - ట్విట్టర్ - యూట్యూబ్ లాంటి సామాజికవేదికల్లో ఈ ఒరవడి ఎక్కువైపోయింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు సరికొత్త సామజిక విప్లవంలా ‘టిక్ టాక్’ వచ్చేసింది. ఇందులో తమ సొంత టాలెంట్ చూపించడానికి అవకాశం కల్పించారు. క్రియేటివిటీతో ఏదైనా చేయడానికి ఇందులో అవకాశం ఉంది. ఫన్ క్రియేట్ చేయడానికి వాడుకోవాల్సిన ఈ యాప్ ను కొందరు రాజకీయ రచ్చ కోసం కూడా వాడుకోవడం దుమారం రేపుతోంది.

తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ‘టిక్ టాక్’ ట్రెండింగ్ లో ఉంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయట.. ఇక్కడ ఈ యాప్ ను నిషేధించే స్థాయికి దీని తీవ్రత చేరినట్టు సమాచారం.

ఇందులో రాజకీయ దురద్దేశ వీడియోలు ఎక్కువ కావడంతో ‘టిక్ టాక్’ను నిషేధించాలని తాజాగా తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఈ యాప్ లో వస్తున్న అశ్లీల సంభాషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని తమిళనాడు అసెంబ్లీ అభిప్రాయపడింది. దీంతో ఈ యాప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా అసెంబ్లీ డిమాండ్ చేసింది.

అసెంబ్లీలో టిక్ టాక్ నిషేధంపై తాజాగా ఆ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ వెల్లడించారు. యాప్ లో పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరిపిస్తూ సంభాషణలు ఉన్నాయని మంత్రి మణికంఠన్ పేర్కొన్నారు. యాప్ ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.