Begin typing your search above and press return to search.
విడ్డూరం... కళ్లకు గంతలతో ఎన్నికల ప్రచారం!
By: Tupaki Desk | 29 March 2021 4:05 AM GMTతమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిని మించి మరొకరు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్తున్నారు. డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే నేతలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. అమ్మ పార్టీకి చెందిన ఓ నేత కళ్లకు గంతలతో ఎన్నికల ప్రచారం చేసి వార్తల్లో నిలిచారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత కళ్లకు గంతలు కట్టుకొని బైక్ రైడ్ చేశారు. అంతేకాదు స్కూటీ ముందు తమ పార్టీ అభ్యర్థి ఫొటో పెట్టుకొని.. తమ నాయకుడినే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తొండముత్తూరు నియోజకవర్గానికి చెందిన యూఎంటీ రాజా అన్నాడీఎంకే పార్టీ వీరాభిమాని కాగా... ఆ పార్టీని ఎలాగైనా గెలిపించాలని తనదైన రీతిలో ప్రచారం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎస్పీ వేలుమణి పోటీలో ఉన్నారు. ఆయనను ఎలాగైనా గెలిపించాలని రాజా వింత ప్రచారం చేపట్టారు. తన ద్విచక్రవాహనంపై వేలుమణి ఫొటో ఉంచి.. అన్నాడీఎంకే పథకాలను వివరించారు.
గతంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉండేదని... రోడ్డుపై వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. కళ్లకు గంతలు కట్టుకొని కూడా వాహనం నడపవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఈ రీతిలో ప్రచారం మొదలు పెట్టానని అన్నారు. ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీని గెలిపించాలని కోరారు. కళ్లకు గంతలు కట్టుకొని బైక్ నడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని డీఎంకే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఒపీనియన్ పోల్స్ సైతం డీఎంకేకే అనుకూలంగా రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీగా సాగనున్న తమిళ పోరు ఆసక్తిగా మారింది.