Begin typing your search above and press return to search.
బాబుపై మండిపడతున్న తమిళ తంబీలు
By: Tupaki Desk | 26 Nov 2017 2:14 PM GMTఇరుగుపొరుగు రాష్ర్టాలుగా ఉన్న ఏపీ, తమిళనాడుల మధ్య మరో సమస్య వచ్చిపడింది. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్, పాలారు డ్యామ్ వివాదం నడుస్తుండగా...తాజాగా నీటికి సంబంధించిన సమస్యలు తెరమీదకు వచ్చాయి. తమ పేరు చెప్పి ఏపీ సర్కారు నీటిని తరలించుకుపోతోందని చెన్నై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు చెన్నైకి తాగునీటి పేరు చెప్పి కృష్ణాజలాలను భారీగా తరలిస్తోందని తేలింది.
చెన్నై పేరు చెప్పి ఇన్ని నీళ్లు తరలిస్తున్న ఏపీ సర్కారు చెన్నై నగరవాసులకు మంచినీళ్లు సక్రమంగా అందించడం లేదట..! ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కృష్ణాబోర్డుకు రాసిన లేఖతో ఈ విషయం బయటపడింది. సుమారు నాలుగు దశాబ్దాల కిందట అప్పుడు మద్రాసుగా పిలిచిన చెన్నైకి మంచినీటి కోసం కృష్ణా పరీవాహక రాష్ర్టాలైన ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలతో తమిళనాడు ఒప్పందం చేసుకుంది. బేసిన్‌లోని మూడు రాష్ర్టాలు చెరో ఐదు టీఎంసీలను అంటే మొత్తం 15 టీఎంసీలను ప్రతి ఏటా తాగునీటి కోసం ఇవ్వాలనేది ఒప్పంద సారాంశం. అంటే ఏపీ తన వంతుగా ఇవ్వాల్సింది కేవలం 5 టీఎంసీలే. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు మీదుగా తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీటిని పంపించాలి. ఉమ్మడి ఏపీ తరఫున ఇవ్వాల్సిన ఐదు టీఎంసీలలో తెలంగాణ వాటా 1.67 టీఎంసీలు ఉంటుంది. చెన్నై కి నీటి కోసం కూడా కృష్ణాబోర్డుకు ఏపీ ఇండెంట్ పెడుతున్నది. తమ రాష్ట్ర అవసరాలతో చెన్నైకి నీటి అవసరాలను కలిపి ఇండెంట్లు సమర్పిస్తూ నీటిని పొందుతున్నది. చెన్నై కోసం పోతిరెడ్డిపాడు నుంచి అంత కావాలి, ఇంత కావాలని ఎన్నోసార్లు లేఖలు రాసింది. తీరా చూస్తే తీసుకున్నన్ని నీళ్లను చెన్నైకి పంపడంలేదట. దీంతో ఈ వ్యవహారంపై చర్చకు ఈనెల 28న బెంగళూరులో బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక అధికారులు పాల్గొంటారని తెలిసింది. ఇందులో చెన్నైకి 15 టీఎంసీల సరఫరాకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించే అవకాశముందని సమాచారం.