Begin typing your search above and press return to search.
తమిళనాట చిన్నపార్టీల గుబులు.. చీలికలతో తలరాతలు మారతాయా ?
By: Tupaki Desk | 24 March 2021 4:30 AM GMTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేతలకు పెద్ద చిక్కే వచ్చి పడిందని పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ప్రధాన పార్టీలు తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఏదైనా తేడా వస్తుందేమోనని.. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు చిన్నపార్టీలను లోపాయికారీగా రంగంలోకి దింపి సామాజిక వర్గం, మతాల ప్రాతిపదికన ఓట్లను చీల్చే కార్యక్రమాలు చేస్తుండడం ఇటీవల కాలంలో మనకు కనిపిస్తూనే ఉంది. అంటే.. ఉద్దేశ పూర్వకంగా పెద్దపార్టీలు.. చిన్నపార్టీలను ప్రోత్సహించడం అన్నమాట. అయితే.. చిత్రంగా తమిళనాడులో మాత్రం ఎవరూ ప్రోత్సహించకుండానే.. ఇబ్బడి ముబ్బడిగా ఉన్న చిన్న పార్టీలు.. రంగంలోకి దిగడంతో ఇప్పుడు వారిని బుజ్జగించేందుకు.. పోటీ నుంచి తప్పించేందుకు పెద్దపార్టీలు.. సతమతమవుతున్నాయి.
అధికార అన్నాడీఎంకే నేతృత్వ కూటమిలో బీజేపీ, పీఎంకే, టీఎంసీ తదితర పార్టీలు, డీఎంకే నేతృత్వ కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, డీపీఐ, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఎంఎంకే తదితర పార్టీలు, కమల్‌హాసన్‌కు చెందిన మక్కల్‌నీది మయ్యం(ఎంఎన్‌ఎం) నేతృత్వ కూటమిలో సమత్తువ మక్కల్ కట్చి (ఎస్‌ఎంకే), ఇండియా జననాయగ కట్చి (ఐజేకే), శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతృత్వ కూటమిలో నటుడు విజయకాంత్‌కు చెందిన డీఎండీకే, ఎంఐఎం తదితర పార్టీలున్నాయి. సినీ దర్శకుడు సీమాన్‌కు చెందిన ‘నాం తమిళర్ కట్చి’ నేతృత్వ కూటమిలో కొన్ని అసలు ఉనికే లేని పార్టీలు కూడా చేరాయి. దీంతో ఈ చిన్న కూటములు, చిన్న పార్టీల పోటీ తమనెక్కడ ముంచుతుందోనని అన్నాడీఎంకే, డీఎంకే బిక్కుబిక్కుమంటున్నాయి.
దినకరన్ కూటమితో అన్నాడీఎంకేకు ముప్పు ఉందని ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అన్నాడీఎంకే నుంచి విడివడిన ఏఎంఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో తన ‘ప్రతాపం’ చూపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ‘అమ్మ పాలన మాతోనే సాధ్యం’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న దినకరన్.. అన్నాడీఎంకే అసంతుష్టులను చేరదీసి సీట్లు ఇస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల్లో అత్యధికులు అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. ఇక విజయకాంత్‌కు చెందిన డీఎండీకే ఈ సారి అన్నాడీఎంకే నుంచి బయటికి రావడంతో డీఎండీకే కూడా ఈసారి అన్నాడీఎంకే ఓట్లను చీలుస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో కమల్‌హాసన్ కూటమితో తమకు స్వల్ప నష్టం వాటిల్లవచ్చని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో(22వ తారీకు) ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణలో చిన్న చిన్న పార్టీల ను పక్కకు తప్పించేందుకు నాయకులు ప్రయత్నిస్తుండడం గమనార్హం.