Begin typing your search above and press return to search.
చినబాబు ఓటమి ఖాయమని అక్కడ తేల్చేశారు
By: Tupaki Desk | 5 May 2019 5:58 AM GMTమా గెలుపు 2వేల శాతం ఖాయమంటూ విపరీతమైన కాన్ఫిడెన్స్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు చెబుతున్నారు. తాజాగా ఎంపీ నియోజకవర్గాల వారీగా రోజుకు రెండు నియోజకవర్గాలపై సమీక్షలు జరుపుతున్న చంద్రబాబు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడుకు చెందిన దినమలర్ అనే తమిళ దినపత్రిక మాత్రం సంచలన కథనాన్ని అచ్చేసింది.
ఆదిలోనే హంసపాదా? పేరుతో ప్రచురించిన కథనంలో నారా లోకేశ్ ఓటమి తప్పేట్టు లేదన్న కథనాన్ని ప్రచురించారు. తండ్రి సీఎం హోదాలో ఉన్నారని.. చేతిలో అధికారం ఉందని.. డబ్బుకు లోటు లేదని.. అయినప్పటికీ లాభం లేదని.. ఎన్నికల్లో ఓటమి తప్పేట్లు లేదంటూ ప్రచురించిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని.. అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును ఖరారు చేసుకోలేకపోయారన్న మదనం తెలుగు తమ్ముళ్లలో చోటు చేసుకున్నట్లు వ్యాఖ్యానించింది. వారసత్వ రాజకీయాల్ని అనుసరిస్తూ.. తన కుమారుడికి పార్టీలో.. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చిన చంద్రబాబు.. లోకేశ్ ను మంత్రిగా నియమించటం తెలిసిందే. లోకేశ్ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపిక సరిగా జరగలేదన్న వాదన ఉంది.
చూస్తూ.. చూస్తూ.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీకి లోకేశ్ దిగారు. ఓట్లు అడిగేందుకు ప్రజల వద్దకు వెళ్లిన వేళలో.. తాము చేసిన తప్పును లోకేశ్ టీం గుర్తించారని చెబుతున్నారు. అధికారం.. డబ్బు.. బలగాన్ని పూర్తిగా వినియోగించినా.. గట్టెక్కేలా లేరని.. ఓడిపోతామా? అనే భయం అతడ్ని ఆవరించి ఉందని సదరు కథనంలో పేర్కొన్నారు.
నేను ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆదిలోనే హంసపాదు అనే ముద్ర పడిపోతుందన్న భీతిని లోకేశ్ ఎదుర్కొంటున్నాడని సదరు కథనంలో రాశారు. లోకేశ్ ఓటమి ఖాయమన్న భావన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడులోనూ కలుగుతోందా? మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.