Begin typing your search above and press return to search.

పార్టీకి ఎర్ర నిధులు పోతాయనే వాటి భయం!

By:  Tupaki Desk   |   14 April 2015 2:14 PM GMT
పార్టీకి ఎర్ర నిధులు పోతాయనే వాటి భయం!
X
శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం స్మగ్లర్లకు తమిళనాడులోని కొన్ని చిన్న చితక పార్టీలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. స్మగ్లర్ల మాటున కూలీలకు అనుకూలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మానవ హక్కుల సంఘాలు, హైకోర్టుల్లో కేసులు వేయిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నాయి. అయితే, తమకు వచ్చే ఆదాయం పోతోందన్న ఆందోళనతోనే ఇవన్నీ ఇలా చేస్తున్నాయనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్న స్మగ్లర్లు తమిళనాడులోని చిన్న చితక పార్టీలకు పార్టీ నిధులు ఇస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయా పార్టీల మనుగడకు కూడా ఎర్ర చందనం స్మగ్లర్ల వంటి సంఘ వ్యతిరేక శక్తులే కారణమని కూడా విమర్శలు ఉన్నాయి. సంఘ వ్యతిరేక శక్తుల నిధులతోనే వైగో వంటి నేతల పార్టీలు మనుగడ సాగిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని పార్టీలకు ఎర్ర నిధులు అందుతున్నాయనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. చందనం స్మగ్లర్లకు కడప, చిత్తూరు జిల్లాల్లో పలువురు అండదండలు అందిస్తున్నారనే విమర్శలూ ఎప్పటినుంచో ఉన్నాయి.

ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడితే ఆయా పార్టీలకు ఇచ్చే నిధులు ఆగిపోతాయి. ఆయా పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. నిధులు ఆగిపోతాయనే ఆందోళన వాటిని కాలు నిలువనీయడం లేదు. అందుకే, ఏపీ పోలీసులు కూలీలను చంపేశారంటూ న్యాయ పోరాటానికి దిగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే భవిష్యత్తులో స్మగ్లింగ్‌ను యధేచ్ఛగా చేసుకోవచ్చన్నదే వాటి ఉద్దేశమని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.