Begin typing your search above and press return to search.

గవర్నర్ దూసుకెళుతుంటే.. సారు కనిపించట్లేదే

By:  Tupaki Desk   |   15 Nov 2019 5:35 AM GMT
గవర్నర్ దూసుకెళుతుంటే.. సారు కనిపించట్లేదే
X
టీఆర్ఎస్ నేతల కు.. కార్యకర్తలకు.. అభిమానుల కు ఇప్పుడో బాధ వారిని విపరీతం గా వేధిస్తోంది. ప్రజా ప్రతినిధిగా.. అందునా ముఖ్యమంత్రి హోదా లో ఉన్న కేసీఆర్.. ఎలాంటి కార్యక్రమాల్లో కనిపించక పోవటాన్ని అధికారపక్షానికి చెందిన వారు అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. అదే సమయం లో.. గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళ సై.. ఎక్కడ చూసినా.. ఏ కార్యక్రమంలో నైనా ముఖ్య అతిధి గా పాల్గొంటున్న వైనం అంతకంతకూ పెరుగుతోందంటున్నారు.

ప్రత్యేక దినోత్సవాలు మొదలు రాజధాని హైదరాబాద్ లో జరిగే ముఖ్యమైన పలు కార్యక్రమాల్లో గవర్నర్ ఎక్కువగా దర్శనమిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పాలనా సంబంధమైన అంశాల్లోనూ ఆయన కనిపించటం లేదన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. ప్రజలకు నిత్యం టచ్ లో ఉండాల్సిన సీఎం కేసీఆర్.. ఎప్పుడో కానీ టచ్ లోకి రాక పోతుంటే.. రాజభవన్ లో ఉంటూ అప్పుడప్పుడు మాత్రం కార్యక్రమాల్లో కనిపించే గవర్నర్ మాత్రం డైలీ బేసిస్ లో కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

అంతేకాదు.. వివిధ కార్యక్రమాల తో రాజ్ భవన్ సందడిగా మారుతుంటే.. ముఖ్య మంత్రి నివాసం మాత్రం కొందరికి మాత్రం ఎంట్రీ అన్నట్లు గా ఉంటున్న వైనంపై పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సైను వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన దానికి తగ్గట్లే.. ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉందంటున్నారు. తమిళ సైను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఎంపిక చేయటం వెనుక ఉద్దేశం ఏమిటన్న విషయం తెలిసిన వేళ.. అందుకు విరుగుడు గా మరింత చురుగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలని..కానీ అలాంటిదేమీ లేకపోవటం పై గులాబీ దళం ఫీలై పోతోంది.

ఇమేజ్ పరంగా సీఎం కేసీఆర్ ను కొట్టేవారెవరూ లేనప్పటికీ.. ప్రజల్లో మమేక మైనట్లుగా కనిపించే విషయం లో మాత్రం ఆయనకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకూ సాగించిన స్టైల్ ను కాస్త మార్చకుంటే గులాబీ బాస్ కు కొత్త చిక్కులు తప్పవంటున్నారు. గవర్నరమ్మ దూసుకెళ్తున్న వేళ.. కేసీఆర్ తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.