Begin typing your search above and press return to search.
తమిళుల కోసం ‘తారలే’ దిగి వచ్చారు
By: Tupaki Desk | 4 Dec 2015 7:05 PM GMTసదూర తీరాన ఉంటూ మిణుకు మిణుకుమనే నక్షత్రాల్ని అబ్బురంగా చేస్తుంటాం. అంతే అబ్బురం సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల్ని చూస్తే. అయితే.. ఆకాశంలో ఉన్న తారలకు.. తాము అమితంగా అభిమానించే తారలకు మధ్య తేడా చెన్నై వాసులకు ఈసారి స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. నిజానికి ఒక్క చెన్నై వాసులు మాత్రమే కాదు.. పలు రాష్ట్రాల ప్రజలంతా తమిళ నటుల ఔదర్యానికి విస్తుపోతున్నారు. మిగిలిన సినీ అభిమానుల కంటే తమిళులు సినీతారలను తమ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు. అలాంటి ప్రేమకు వాళ్లు అర్హులన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఉదంతాల్ని చూస్తే ఇట్టే తెలుస్తోంది.
ఏదైనా విపత్తు వస్తే.. మహా అయితే.. విరాళాలు ప్రకటించటం తప్పించి పెద్దగా స్పందించటం అనేది కనిపించదు. కానీ.. తమిళ చిత్ర పరిశ్రమ అందుకు భిన్నంగా వ్యవహరించింది. హీరోలు.. హీరోయిన్లతో (కొందరు మాత్రమే).. సినిమా పరిశ్రమకు చెందిన పలువురితో పాటు.. సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవవరికి వారు తమకు తోచిన సాయాన్ని చేయటానికి ముందుకొచ్చారు. ఇంట్లో కూర్చొని బ్యాంకులో అపరిమితంగా ఉండే బ్యాలెన్స్ లో పిసరంత ప్రకటించేసి చేతులు దులుపుకోలేదు.
మనసున్న మారాజుల్లా వ్యవహరించారు. తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. భోజనం పెట్టారు. పడుకోవటానికి చాపలు.. దిండ్లు.. దుప్పట్లు ఇచ్చారు. తమకున్న కల్యాణ మండపాల్లో ఉండిపొమ్మని కోరటమే కాదు.. వారికి భోజన వసతి కల్పించే ప్రయత్నం చేశారు. ఇలా ఒకటేంటి.. ఎవరికి వారు తమకు తోచిన సాయాన్ని ఇచ్చారు. మామూలు రోజుల్లో అందనంత దూరంలో ఉన్నట్లు కనిపించే తారలు.. కష్టంలో ఉన్న తమ ప్రజలకు అండగా ఉన్నామని చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపించారు. హీరో సిదార్థ్ ఒక రకంగా సాయానికి నిలువెత్తు రూపంగా నిలిస్తే.. హీరో విశాల్ అయితే.. రియల్ హీరోగా తన ప్రజల కోసం అండగా నిలిచాడు.
ఒకరిద్దరిని ప్రస్తావించటం మా ఉద్దేశం కాదు. ఎంతో మంది ఎంతో చేస్తున్నారు. అలాంటి వారిని ప్రస్తావించటం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. వారి సేవల్ని తక్కువ చేసి చెప్పలేం. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్న వారి సంగతులు చెప్పుకుంటే..
= చెన్నై నగరంలోని మౌంట్ రోడ్ లో ఫేమస్ థియేటర్ అయిన సత్యం సినిమా కాంప్లెక్స్.. విల్లివాకంలో ఉన్న ఏజీఎస్ సినిమాస్ యాజమాన్యాలు చెన్నై ప్రజల కోసం తమ థియేటర్లను తెరిచి ఉంచారు. తమ థియేటర్లలో ఉండి పోవచ్చని చెప్పటమే కాదు.. వారి కోసం ఆహారం.. మిగిలిన సౌకర్యాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. థియేటర్ దగ్గర్లో ఉన్న వరద బాధితులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ థియేటర్లలో తలదాచుకోవచ్చని ఆహ్వానించాయి.
= ఇప్పటికే విరాళాల రూపంలో సాయాన్ని ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు చెందిన కల్యాణమండపాల్లో నివాసం ఉండేలా ఏర్పాట్లు చేశారు.
= తమిళ యువ హీరో విజయ్ సైతం.. తనకు చెందిన కల్యాణమండపం (సాల గ్రామంలోని శోభ కల్యాణమండపం) లో ఆశ్రయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
= ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వరదబాధితులతో మమేకం అయ్యారు. వారికి సాయంగా నిలిచారు. వసతి కల్పించటంతో పాటు.. ఆహారపదార్థాల్ని సమకూర్చారు.
= ప్రముఖ హీరో విశాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సామాజిక కార్యకర్తలా అతడు పడుతున్న శ్రమ ఎంత చెప్పినా తక్కువే.
= హీరో సిద్దార్థ్ వ్యవహారమే వేరు. ఓపక్క తన ఇల్లు మునిగిపోయినా ఆయన ఆ విషయాన్ని వదిలేసి.. తన చుట్టూ ఉన్న ప్రజల కోసం.. వారికి చేతనైనంత సాయం చేసేందుకు పడిన తపన అంతాఇంతా కాదు.
= విలక్షణ నటుడు మమ్ముట్టి తీరు చూస్తే మనసు కదిలిపోవాల్సిందే. అంత పెద్ద స్టార్ సైతం వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన మనసు ఎంత విశాలమో చేతల్లో చేసి చూపించారు. అన్నానగర్.. అరుంబాకం.. అమింజికరై.. ఎంఎండీ కాలనీల్లోని వారికి తన ఇల్లు దగ్గరగా ఉంటుందని.. ఎవరైనా ఇబ్బందిగా ఉంటే తన ఇంటికి రావాలన్నాడు. తన ఇంట్లో ఉంచుకుంటానని అన్నం పెడతానని. విశ్రాంతి తీసుకోవటానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఆహ్వానించాడు.
= ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ రూ.కోటి విరాళం ప్రకటించాడు.
= తారల దృష్టి చెన్నై మీద ఉండటంతో హీరో ధనుష్ తన సేవా కార్యక్రమాన్ని విస్తరించాడు. వరదల కారణంగా దారుణంగా దెబ్బ తిన్న కడలూరుపై ఆయన దృష్టి సారించటంతో పాటు.. సినీ ప్రముఖులు కొందరు కడలూరు మీద ఫోకస్ చేసి సాయం చేయాలని కోరాడు.
= తమిళ సినీ నటులే కాదు.. తెలుగు నటులు కూడా తమిళులకు సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. సినీ హీరో నవదీప్.. రానాతోపాటు పలువురు యువనటులు ఒక గ్రూప్ గా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే చెన్నైకి వారు ఆహార సామాగ్రిని ట్రక్కుల్లో పంపారు. ఎవరైనా ఏదైనా సాయం చేయాలంటే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో తమ అపన్నహస్తం అందించాలని.. వాటిని చెన్నైకి పంపుతామని పేర్కొన్నారు.