Begin typing your search above and press return to search.
పంచె కట్టగానే ఫిదా అయ్యేందుకు తంబీలు తెలుగోళ్లు కాదు
By: Tupaki Desk | 12 Oct 2019 5:16 AM GMTకుడుము ఇస్తే పండుగ చేసుకునే తత్త్వం తెలుగోళ్ల సొంతం. చిన్నదానికి అవసరానికి మించిన సంతోషాన్ని వ్యక్తం చేయటం ఒక అలవాటు. త్వరగా నమ్మేయటం.. త్వరగా ద్వేషించటం లాంటి లక్షణాలు తెలుగోళ్లకు ఎక్కువ. ఈ కారణంతోనే అదే పనిగా మోసపోతుంటారు. వారి బలహీనతల్ని ఎప్పటికప్పుడు రంగులు మార్చే ఊసరవెల్లుల బారిన పడుతుంటారు.
తెలుగోళ్ల మాదిరి అందరూ ఉంటారనుకోవటం పొరపాటు. అందునా తమిళులు ఉంటారనుకోవటానికి మించిన పొరపాటు మరొకటి ఉండదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజా భారత పర్యటన సందర్భంగా తమిళనాడులోని మహాబలిపురానికి రావటం తెలిసిందే. చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు ఎప్పుడూ లేని రీతిలో మోడీ తన వస్త్రధారణను పూర్తిగా మార్చేసుకున్నారు.
తమిళుల వస్త్రధారణ అయిన పంచె.. చొక్కా.. పైన కండువా వేసుకొన్నారు. దీన్ని చూసి తెలుగు మీడియా మొత్తం మురిసిపోవటమే కాదు.. తమిళులు సైతం మురిసిపోతారంటూ ఎవరికి తోచిన రీతిలో వారు రాసేయటం.. మాట్లాడేయటం జరిగింది. కానీ.. వారంతా మర్చిపోతున్నది.. తాము చెబుతున్నది తమిళుల గురించి అన్నది. తాను టార్గెట్ చేసిన వారి మనసుల్ని దోచుకునేందుకు మోడీ ఎంతవరకైనా వెళతారన్న సంగతి కొత్తేం కాదు.
కానీ.. తమిళులు అలాంటి వాటిని ఒక పట్టాన ఒప్పుకోరు. ఎవరిదాకానో ఎందుకు? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయాన్నే తీసుకోండి. ఆయన కన్నడ వ్యక్తి అయినప్పటికీ.. తమ ప్రాణంలో ప్రాణంగా బావిస్తారు. అభిమానిస్తారు.. ఆరాధిస్తారు. కానీ.. తమిళనాడు.. కర్ణాటక ఇష్యూ వచ్చే వేళకు.. రజనీ తమిళుల తరఫున మాట్లాడినా.. ఆయన్ను వేరుగా చూస్తారనే చెబుతారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉండే ఈ లక్షణం తమిళులలో టన్నులు టన్నులు ఉంటుంది.
వారిని మనసుల్ని గెలుచుకోవటానికి డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తేనే.. తమిళంలో నాలుగు మాటలు మాట్లాడితేనో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి.. అదే మహాప్రసాదంగా భావించే తీరు తమిళుల్లో అస్సలు ఉండదు. ఇదే పని తెలుగోళ్లు చేస్తే.. వారు విపరీతమైన ఆనందానికి గురవుతారు. కానీ.. తమిళులు మాత్రం ఆగ్రహంతో ఉడికిపోతారు. తమను మాయ చేసేందుకు ప్రయత్నిస్తారని ఫీల్ అవుతారు. మరింత మొండిగా తయారవుతారు.
ఇలాంటి మేజిక్కులు తమ వద్ద వర్క్ వుట్ కావన్న విషయాన్ని ఓట్లతో చెప్పేస్తారు. దీనికి తగ్గట్లే.. తమిళులకు దగ్గర కావటానికి మోడీ ప్రయత్నించిన ప్రతిసారీ.. అందుకు భిన్నంగా వారు మరింత మొండిగా తమ అస్తిత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయటం ఇప్పటికే పలుమార్లు చూశాం. దేశం మొత్తం మోడీని.. మోడీ సపోర్ట్ చేసే వారికి జై కొడితే.. తమిళులు మాత్రం అందుకు భిన్నమైన తీర్పు ఇవ్వటాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా చెప్పేదేమంటే.. పంచె కట్టినంతనే ఫిదా కావటానికి తమిళులేమీ తెలుగోళ్లు కాదు.