Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ గవర్నర్.. మోడీపై పంచ్‌లు.. అదిరిపోయాయిగా!
By: Tupaki Desk | 23 Aug 2022 2:30 AM GMTఆయన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్. సాధారణంగా రాజకీయాల గురించి మాట్లాడకూడ దు. కానీ, ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌లు కూడా రాజకీయాలు మాట్లాడేస్తున్నా రు. ఇటీవల రెండు రోజుల కిందట.. తెలంగాణ గవర్నర్.. తమిళనాడులో పర్యటించారు.
అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మోడీని రాముడుతో పోలుస్తూ.. భజన చేశారు. మోడీ పాలన లేకపోతే.. కరోనాతోదేశం అతలాకుతలం అయిపోయేదన్నారు. సో.. గవర్నర్ స్థానంలో ఉండి.. ఇలా మాట్లాడొచ్చా.. అంటే భావప్రకటనా స్వేచ్ఛ అంటారు.
సో.. ఈ క్రమంలోనే ఒక ఫైర్ బ్రాండ్ గవర్నర్ కూడా.. ఇదే రేంజ్‌లో రాజకీయాలు మాట్లాడతారు. అయితే.. ఆయన ఫుల్లు నెగిటివ్. మోడీపై వీలు కుదిరినప్పుడల్లా నిప్పులు చెరుగుతున్నారు. ఆయనే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఆయన నిప్పులు చెరిగారు. హరియాణా నూహ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై సీబీఐ అధికారులు దాడి చేసిన సమ యంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ``కేంద్రం మూడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. బీజేపీలో విచారించాల్సిన వ్యక్తులు లేరా? నేను పది మంది పేర్లను ఇస్తాను. వారందరిపైనా విచారణ చేయండి. అవసరమైతే నాపైన కూడా విచారణ జరిపించండి``. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కనీస మద్దతు ధర, రైతుల పోరాటంపైనా గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. రైతులను మనం భయపెట్టలేమని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఎలాగైనా సాధిస్తారని మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో రైతు ఆందోళనలను ప్రధాని మోడీ తేలికగా తీసుకున్నారని చెప్పారు. మీరు వెనక్కి తగ్గినప్పుడే రైతులు వెళ్లిపోతారని ఆయనకు(మోడీకి) చెప్పానని మాలిక్ తెలిపారు.
చివరకు ఆయన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందని.. జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని మాలిక్ మాలిక్ అన్నారు. చిత్రం ఏంటంటే..ఈయన కూడా బీజేపీ నాయకుడే! మరి దీనిపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.