Begin typing your search above and press return to search.
గవర్నర్.. మళ్లీ కెలికేశారు.. కేసీఆర్‌పై కామెంట్స్
By: Tupaki Desk | 21 Oct 2022 3:30 PM GMTతెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై ఇప్పటికే పలు సందర్భాల్లో కేసీఆర్ సర్కార్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా తమిళిసై మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణలో వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను పర్యటించగానే.. సీఎం కేసీఆర్ వరద ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాలకు తరలివెళ్లారు అన్నారు.
``వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎంను రప్పించిన చరిత్ర నాది. ఏనాడు నేను అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు`` అన్నారు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేశారు.
గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతున్నానని అన్నారు. గవర్నర్‌గా తనకి అధికారం ఉన్నా ప్రత్యేక విమానాన్ని తన ప్రయాణానికి ఉపయోగించలేదని తెలిపారు. మరి గవర్నర్ వ్యాఖ్యలపై.. ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.