Begin typing your search above and press return to search.
మోడి గాలానికి తంబిలు తగులుకుంటారా ?
By: Tupaki Desk | 3 March 2021 1:30 AM GMTఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నరేంద్రమోడి వైఖరి చాలా విచిత్రంగా మారిపోతోంది. లాజికల్ గా గెలుపు అవకాశాలు లేవని అర్ధమైపోయిన రాష్ట్రాల్లో సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. తాజాగా జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడి చేసిందిదే. మన్ కీ బాత్ కార్యక్రమం చివరలో మోడి మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాష తమిళంగా మోడి అభివర్ణించారు. అలాంటి తమిళంను నేర్చుకోలేకపోయినందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు. తమిళ సాహిత్యం చాలా అద్భుతమన్నారు.
ఒక్కసారిగా తమిళ భాష మీద నరేంద్రమోడికి ఎందుకింత ప్రేమ పొంగిపోతోంది ? ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్నది అర్ధమైపోతోంది. తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం అస్సాం, పాండిచ్చేరిలో తప్ప మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు లేవని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయి. కేరళ, తమిళనాడులో అయితే బీజేపీ అసలు ఖాతా తెరుస్తుందా అన్నది కూడా అనుమానమే అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే తమిళులకు మోడి గాలమేస్తున్నారు. ఎలాగైనా తమిళనాడులో ఓ నాలుగు అసెంబ్లీ సీట్లలో అయినా గెలవాలని బీజేపీ ఎప్పటి నుండో విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటు డీఎంకే అటు ఏఐఏడీఎంకే పార్టీలు లేదా కూటముల మధ్య కాలు పెట్టడానికి కూడా బీజేపీకి దశాబ్దాలుగా అవకాశం రావటం లేదు. అయితే జయలలిత మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఈసారి ఎలాగైనా బీజేపీ కచ్చితంగా నాలుగు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నది.
తాజాగా వెల్లడైన ఏబీపీ-సీ వోటర్ సర్వేలో డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని, ఏఐఏడీఎంకే కూటమి ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని తేలింది. అయితే ఇతరులకు 8-20 సీట్ల మధ్య వస్తుందని సర్వేలో బయటపడింది. ఇతరులు అన్నారే కానీ ఆ ఇతరుల్లో ఏ ఏ పార్టీలున్నాయో ఎవరికీ తెలీటం లేదు. ఇందులో బీజేపీ ఉందా లేదా అన్న కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. కాబట్టే జనాలను ఎలాగైనా తంబీలను ఆకట్టుకునేందుకు భాషను పొగడటం ప్రారంభించారు. మరి మోడి గాలానికి తంబీలు తగులుకుంటారా ? చూడాల్సిందే.