Begin typing your search above and press return to search.

నెలకి ప్రతి మహిళకి రూ. 1000 .. బంపర్ ఆఫర్ , ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   8 March 2021 5:34 AM GMT
నెలకి ప్రతి మహిళకి రూ. 1000 .. బంపర్ ఆఫర్ , ఎక్కడంటే  !
X
తమిళనాడు లో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్డ్యూల్ కూడా ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అన్ని ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్నాయి. నాయకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసేస్తున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్ ‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిచీలో ఆదివారం భారీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. డీఎంకే కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తమిళనాడు అభివృద్ధి కోసం పదేళ్ల వ్యూహాన్ని స్టాలిన్ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో తమిళనాడును అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానానికి చేర్చడమే ఈ విజన్ లక్ష్యమని అన్నారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే.. ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం వంటి రంగాలను మెరుగుపరుస్తామని అన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులో ఇంటి అధిపతిగా ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ .1000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు. మరోవైపు మార్చి 11న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని స్టాలిన్‌ ప్రకటించారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినదని తెలిపారు. తమిళనాడు ప్రజలకు కొత్త ఆరంభం కోసం అందులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. 2006 నాటి ఎన్నికల సందర్భంగా కరుణానిధి విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో తరహాలో ఇది ఛాంపియన్‌గా నిలుస్తుందని అన్నారు. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి. డీఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్నాయి