Begin typing your search above and press return to search.

ఎన్నికల హామీలు: గెలిపిస్తే రూ.కోటి.. చంద్రమండలంపైకి..

By:  Tupaki Desk   |   25 March 2021 3:14 PM GMT
ఎన్నికల హామీలు: గెలిపిస్తే రూ.కోటి.. చంద్రమండలంపైకి..
X
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడి అభ్యర్థులు గెలుపు కోసం నమ్మశక్యం కానీ హామీలు గుప్పిస్తున్నారు. ఏప్రిల్ 6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా షాకింగ్ హామీలిస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో చిత్రవిచిత్రమైన హామీలిస్తున్నారు. ఇవిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

దక్షిణ మధురై నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి శరవణన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో సంచలనమైంది. అందులో కళ్లు బైర్లు కమ్మే హామీలిచ్చాడు.  ప్రతీ ఇంటికి ఒక ఐఫోన్ , కారు, హెలికాప్టర్, రోబో ఇస్తానని.. స్విమ్మింగ్ ఫూల్ ఉన్న ఇళ్లు, యువతకు కోటి రూపాయాలతోపాటు వందరోజుల్లో చంద్రుడి మీదకు టూర్ తీసుకెళ్తానంటూ అలవికాని హామీలిచ్చాడు.

ఇవే కాదు మధురైలో స్పేస్ రీసెర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఐస్ బర్గ్ ను ఏర్పాటు చేస్తానని ఈ స్వతంత్ర అభ్యర్థి హామీలు ఇవ్వడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇక మొదకురిచి నుంచి బీజేపీ తరుఫున పోటీచేస్తున్న డాక్టర్ సరస్వతి వినూత్న హామీలిచ్చాడు. ప్రజలు మోకాలినొప్పులతో బాధపడుతున్నట్టు తెలిసిందని.. తనను గెలిపిస్తే ఉచితంగా మోకాలి చికిత్స ఆపరేషన్ చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇక జల్లికట్టు కోట కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.