Begin typing your search above and press return to search.
షుగర్ - బీపీ ఉన్నాయి..ప్లీజ్ మీ ఓటు వేసి గెలిపించండి!
By: Tupaki Desk | 26 March 2021 10:30 AM GMTతమిళనాడు లో ఎన్నికల ప్రచారం రోజురోజుకి మరింత వేడేక్కుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు కొత్త కొత్త అస్త్రాలతో ఓట్లు అడుగుతున్నారు. ఓటర్ల పై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ మద్యే ఓ ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలని చంద్రమండలానికి టూర్ తీసుకువెళ్తా , ఇంటికో రోబో ఇస్తా అంటూ హామీల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడు కి చెందిన ఓ మంత్రి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తాను బీపీ, షుగర్‌తో బాధపడుతున్నానని, కాబట్టి తనను ఆదరించాలని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రి విజయభాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆయన పుదుకోట్టై జిల్లా విరాళిమలై నుంచి రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తుండడంతో ఆయన స్పందించారు. తాను సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఓట్ల కోసం పాకులాడడం లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం.