Begin typing your search above and press return to search.
రోజుకో ఫుల్ బాటిల్ మందు... రూ.10లక్షల రుణమాఫీ .. ఆ ఓటర్లకు బంపర్ ఆఫర్
By: Tupaki Desk | 30 March 2021 5:30 AM GMTతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మంచి ఊపందుకుంది. అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు వారిపై హమీల వర్షం కురిపిస్తున్నాయి. అన్ని ఫ్రీ అంటూ ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసి ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానికి తగ్గట్టే ధీటుగా ఇండిపెండెంట్లు కూడా హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని అంథియుర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న షేక్ దావూద్ అనే అభ్యర్థి స్థానిక ఓటర్లకుషాక్ అయ్యే రీతిలో హామీలు కురిపిస్తున్నాడు.
సౌత్ మధురైలో పోటీ చేస్తున్న శరవణన్ కు ధీటుగా హామీల వర్షం కురిపంచాడు. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ పదిలక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు ఒక్కో ఇంటికి రూ. 25 వేలు ఇస్తా అన్నాడు. మందుబాబులను కుర్రాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి రోజూ ఇంటికి లీటర్ మందు, లేదా బీర్, ఎవరు ఏది కోరుకుంటే అది సరఫరా చేస్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపిస్తానని చెప్పాడు. అందరికంటే భిన్నంగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజలకు సంచలన హామీలిచ్చారు. ఇంతవరకు దేశంలో ఏ అభ్యర్థి ఇవ్వని విధంగా హామీల వర్షం కురిపించారు. ఆ హామీలు విన్న ఓటర్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ అభ్యర్థి ఇచ్చిన హామీలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
అలాగే తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న శరవరణ్ అనే వ్యక్తి, తన నియోజకవర్గం కోసం స్పెషల్ మేనిఫెస్టోను తయారు చేశారు. అది చదువుకున్నవారికి నవ్వాలో ఎడవాలో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇతకి సదరు అభ్యర్థి ఏయే హామీలిచ్చాడంటే నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్ ల వారీగా చంద్రమండలానికి తరలించడం, ఇందుకోసం స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం. ఇక ఇళ్లలో ఆడవాళ్లకు పనిలో సాయంగా ఉండేందుకు ఇంటింటికీ ఓ రోబోను పంపిణీ చేస్తాడట. అలాగే మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు ఇస్తారట. ఇక ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండను నిర్మిస్తాడట. అలాగే ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రాన్నే సృష్టించి బీచ్ నిర్మిస్తారట. నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ కూడా ఇస్తానని ప్రకటించాడు.