Begin typing your search above and press return to search.
తమిళనాడు లో కలకలం...స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు!
By: Tupaki Desk | 2 April 2021 8:17 AM GMTతమిళనాడులో ఎన్నికల ముందు ముందు తీవ్ర కలకలం. ఎన్నికల పోలింగ్ కు ఇక సరిగ్గా 4 రోజుల ముందు డీఎంకే అధినేత స్టాలిన్ అల్లుడి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. చెన్నైలోని నాలుగు చోట్ల ఏకాకాలంలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. స్టాలిన్ అల్లుడు శబరీశన్ తో పాటు అన్నానగర్ డీఎంకే అభ్యర్థి కుమారుడి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
ఆయన శబరీషన్ ఇంట్లోనే వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే నేత ఇండ్లల్లో ఐటీ సోదాలు జరగడం ఇది రెండవసారి. గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ ఇంట్లో కూడా ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. వేలూ ఇంటి నుంచి భారీ స్థాయిలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు చేయడంతో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. ఆదాయ పన్నుశాఖ సోదాలను డీఎంకే నేతలు ఖండించారు. కేంద్ర సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. రాజకీయ కక్ష సాధింపులోనే భాగంగానే శబరీషన్‌తో పాటు డీఎంకే ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే అద్బుత విజయాన్ని సాధించింది. అయితే , కరుణానిధి, జయలలిత మరణించిన విషయం తెలిసిందే. వారిద్దరు లేకుండా తమిళనాడులో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఈసారి ఎలాగైనా గెలవాని డీఎంకే తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అటు అన్నాడీఎంకే సైతం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.