Begin typing your search above and press return to search.

మోడీ - అమిత్ షా.. ప్లీజ్ మా దగ్గర ప్రచారం వద్దు!

By:  Tupaki Desk   |   2 April 2021 9:15 AM GMT
మోడీ - అమిత్ షా.. ప్లీజ్ మా దగ్గర ప్రచారం వద్దు!
X
కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజాల మరణం.. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ సన్యాసం.. నడుమ స్టార్లు లేకుండా తమిళనాట చారిత్రక ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడుతారో తెలియడం లేదు. తమిళులకు ఆత్మగౌరవం.. ద్రావిడ రాజకీయ వాదం ఎక్కువ.

ఈ క్రమంలోనే అప్పట్లో బీజేపీ ‘జల్లుకట్టు’ వద్దన్నప్పుడు ఏకమై పెద్ద ఉద్యమమే చేశారు. ఇప్పుడు బీజేపీని కూడా దూరం పెడుతున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా కూడా అన్నాడీఎంకే ఆ పార్టీని దూరంగా పెడుతోంది. ఉమ్మడి ప్రచారానికి నో చెబుతోంది. బీజేపీతో వెళితే ఉన్న ఓట్లు కూడా పడవని.. ప్రచారానికి దూరం పెడుతోందట..

ద్రవిడవాదం తమిళనాట ఎక్కువ. ఆ వాదానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తోంది. అందుకే అక్కడి వారు బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. అన్నాడీఎంకే ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అన్నాడీఎంకేను ఆర్యుల పార్టీ అని.. హిందీ రాష్ట్రాల పార్టీ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీతో కలిసి వెళ్లడానికి అన్నాడీఎంకే సాహసించడం లేదు.

ఇక బీజేపీ అభ్యర్థులు సైతం అన్నాడీఎంకే కండువాలతో పోటీచేస్తుండడం విశేషం.. అనేక నియోజకవర్గాల్లో వారు తమ జాతీయ నేతలైన నరేంద్ర మోదీ, అమిత్‌ షాల ఫోటోలు పట్టుకుని తిరగడం లేదు. జయలలిత ఫోటోనే నమ్ముకుని, అన్నాడీఎంకే జెండాలనే చేతబూని వెళుతుండడం కనిపించింది.

స్టాలిన్-సీఎం ఫళనిస్వామి ఇద్దరికీ సినీ నేపథ్యంలో లేకపోవడంతో వీరికి ప్రజల్లో అంతగా క్రేజ్ లేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి నెలకొంది. జయలలిత ప్రభావం అన్నాడీఎంకేకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. స్టాలిన్ కు ఇంటిపోరు అన్నయ్య అళిగిరితో మైనస్ గా మారింది.

తమిళనాడులో ఇప్పుడు మోడీషాల ఫొటోలు అస్సలే బీజేపీ అభ్యర్థుల వెంట కనిపించడం లేదు. బీజేపీ కండువాలు వేసుకోవడం లేదు. మోడీషాల ఎన్నికల మేనేజ్ మెంట్ ఏ మాత్రం పనిచేయని తమిళనాట వాదం, కులం ప్రధాన అంశాలని అంటున్నారు. మోడీషాలు ప్రచారానికి రాకుంటేనే తాము గెలుస్తామని.. వారు రావద్దని బీజేపీ నేతలు కోరుకునే పరిస్థితులు తమిళనాట ఉన్నాయట.. ఇదంతా బీజేపీ పెద్దలు చేసిన ఘనకార్యం అని అంటున్నారు.