Begin typing your search above and press return to search.
షా, మోదీ దిగొచ్చినా కష్టమే.. తమిళుల లెక్కలు వేరు..!
By: Tupaki Desk | 3 April 2021 2:30 PM GMTదేశ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు. తమిళనాట రాజకీయాలు ఒక ఎత్తు. ఎందుకంటే అక్కడి ప్రజల ఆలోచన ధోరణి ఎంతో భిన్నంగా ఉంటుంది. తమిళ ప్రజలకు ప్రాంతీయాభిమానం ఎక్కువ. భాషాభిమానం ఎక్కువ. అందుకే ఎన్నో దశాబ్ధాలుగా అక్కడ ప్రాంతీయ పార్టీలు పాతుకొని పోయాయి. అక్కడి పెరియార్ రామస్వామి శిష్యుడు అన్నాదురై డీఎంకే స్థాపించారు.. ఆ పార్టీ నుంచే అన్నాడీఎంకే విడిపోయింది. అంటే తమిళనాడులో ఉండేవి ద్రవిడ మూలాలు. అన్నాదురై తమిళనాడు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన శిష్యుడు కరుణానిధి డీఎంకేను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఇక ఎంజీ రామచంద్రన్ కూడా డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ వారసురాలే జయలలిత. ఇది స్థూలంగా తమిళనాడు రాజకీయ చరిత్ర. అక్కడ జాతీయ రాజకీయ పార్టీల ఉనికి చాలా తక్కువ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా... అవి అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలయినా అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు అక్కడ తోకపార్టీలుగా ఉండాల్సిందే.
ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎత్తులు వేస్తున్నది. జయలలిత మరణాంతరం బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వ్యూహంలో భాగంగానే శశికళను జైలుకు పంపించింది. అయితే ఇప్పుడు ఆమె జైలు నుంచి విడుదలైనా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బీజేపీ ఒత్తిడితోనే ఆమె తప్పుకున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సారి మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొస్తే.. తన చెప్పుచేతల్లోఉంటూ అక్కడ అధికారంలో ఉంటుందని బీజేపీ ఎత్తులు వేసింది. ఇందుకోసం చాలా కుట్రలు చేసింది. మొదట రజనీని రాజకీయాల్లోకి దింపాలని చూసింది. కానీ అనారోగ్యం ఇతర కారణాలతో ఆయన తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. రజనీకాంత్ ఫ్యాన్స్ ను మెప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాదనలు వస్తున్నాయి.
అయితే తమిళనాడులో ప్రస్తుతం సర్వేలు మొత్తం డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. మాజీ సీఎం, దివంగత నేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ సీఎం కావడం పక్కా అని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి కాకుండా చేసేందుకు బీజేపీ అన్ని కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే స్టాలిన్ బంధువులు, వారి అనుయాయుల ఇళ్లలో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఎన్నికల టైంలో సోదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా ఇక్కడి ప్రజలు వాళ్ల ట్రాప్‌లో పడరని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ప్రచారం చేస్తున్న సీఎం పళనిస్వామి గానీ.. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గానీ మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు కారు. ఒక వేళ అన్నాడీఎంకేలో శశికళ ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో కానీ.. పళనిస్వామిని నమ్మి అక్కడి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కడ బీజేపీ పాచికలు పారకపోవచ్చని కొందరు తమిళ జర్నలిస్టులు అంటున్నారు.