Begin typing your search above and press return to search.

తమిళనాడు లో జూన్ 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్ !

By:  Tupaki Desk   |   15 Jun 2020 1:30 PM GMT
తమిళనాడు లో జూన్ 30 వరకు సంపూర్ణ లాక్ డౌన్  !
X
వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భారీగా స‌డ‌లించిన లాక్ ‌డౌన్ ‌ను మ‌ళ్లీ క‌ఠిన‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించింది. వైర‌స్ విజృంభ‌ణ తీవ్రంగా ఉన్న చెన్నై, కాంచీపురం, చెంగ‌ల్‌ప‌ట్టు, తిరువ‌ల్లూర్ జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వ‌ర‌కు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌బోతున్నట్లు సీఎం ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వైర‌స్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే ఉత్త‌మ మార్గ‌మ‌ని, ఇంకొన్ని రోజులు ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్రజలని కోరారు. గత కొన్ని రోజులుగా మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమ‌లులోకి రాబోతోందని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో ఆ దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్న తొలి రాష్ట్రంగా త‌మిళ‌నాడు నిలిచింది.

ఇకపోతే ఈ జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు స్టోర్స్, కూరగాయల దుకాణాలు, పెట్రోలు బంకులు, మొబైల్ మార్కెట్లు తెరచి ఉంచుతారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలోపే తమ సొంత వాహనాలపై ప్రయాణించవలసి ఉటుంది. అత్యవసర సర్వీసులు, ట్రావెల్, వైద్యపరమైన ఎమర్జెన్సీలను అనుమతిస్తారు. బ్యాంకులు ఈ నెల 29, 30 తేదీల్లో 33 శాతం సిబ్బందితో మాత్రమే పని చేయవలసి ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర కార్యాలయాలు కూడా 33 శాతం ఉద్యోగులతో పని చేయాలని గైడ్ లైన్స్ లో తెలిపారు. అయితే హోటల్స్ తెరచుకోవచ్చు అని చెప్పినప్పటికీ డైనింగ్ కి అవకాశం ఇవ్వలేదు. కేవలం టేకోవర్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు.

కాగా , తమిళనాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 44,661 వైరస్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 24,547 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, 435 మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కొద్ది రోజులుగా త‌మిళ‌నాడులో రోజూ 1500 నుంచి దాదాపు 2 వేల వ‌ర‌కు వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.