Begin typing your search above and press return to search.

తమిళనాడులో 1018 ప్రాంతాల పేర్లలో మార్పు ..ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   12 Jun 2020 1:30 AM GMT
తమిళనాడులో 1018 ప్రాంతాల పేర్లలో మార్పు ..ఎందుకంటే ?
X
తమిళనాడులో వ్యక్తుల పేర్లు, పట్టణాలు పేర్లు.. వారి మాతృభాషలోనే ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు వాసులకు భాషాభిమానం కొంచెం ఎక్కువ అనిచెప్పాలి. ఇలాంటి పేర్లు మనకు మరెక్కడా కనిపించవు ,వినిపించవు. ప్రస్తుతం తమిళంలో ఉన్న పలు పట్టణాల్లో పేర్లు తమిళంలో మాదిరిగా కాకుండా వేరేగా ఉన్నాయని వాటిని తప్పనిసరిగా ఆంగ్లంలో తాము పేర్కొన్నట్లుగా ఉపయోగించాలని తమిళనాడులోని పన్నీర్ సెల్వం ప్రభుత్వం గత ఏప్రిల్ 1న ఒక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం తమిళనాడులోని 1018 ప్రాంతాల పేర్లను తాము సూచించినట్లుగాని ఆంగ్లం లో రాయాలి అని తెలిపింది.

చాలా సంస్థలు పత్రికలు తమ ప్రాంతాలను ఆంగ్లంలో తప్పుగా రాస్తూ ఉన్నాయని దాంతో వాటి అర్థమే మారిపోతుందని తమిళనాడు ప్రభుత్వం వాపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ అత్యన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు ప్రముఖ ప్రాంతాల్లోని పేర్లు ఇకపై విభిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సీఎం పళని స్వామి ఆదేశాలు జారీ చేశారు. కాగా 1979లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీ రామచంద్రన్.. అప్పట్లో కొన్ని కులాల పేరిట ఉన్న వీధులు, కూడళ్ల పేర్లను మార్చారు. ఆ తర్వాత ఇప్పుడే పెద్ద స్థాయిలో ప్రాంతాల పేర్లను మార్చబోతోంది తమిళనాడు ప్రభుత్వం.

తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ..ఇకపై

తొండియార్ పేట – తాండవయ్యార్‌పేట్టాయ్
పురసవాల్కమ్ – పురసైవాక్కమ్
టుటికోరీన్ – తూతుకుడి
ట్రిప్లికేన్ – తిరువల్లికేని
వేపెరి – వేప్పెరి
పెరంబుర్ – పెరంబూర్
తిరుచ్చి – తిరుచిరాపల్లి

ఇలా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లోని పేర్లు ఇకపై తమిళ ఉచ్ఛారణకు తగ్గట్టుగా ఇంగ్లీష్‌లో పేర్లు మారిపోనున్నాయి.