Begin typing your search above and press return to search.
ఉత్తమ పనితీరులో తెలుగు రాష్ట్రాల పరిస్థితి దారుణం.. తమిళనాడే మళ్లీ ముందు!
By: Tupaki Desk | 17 Dec 2022 2:30 AM GMTప్రజలకు సుపరిపాలన అందించడంతోపాటు.. వారి బాగోగులను చూడడమే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయి నా.. ప్రధాన కర్తవ్యం. అయితే, ఈ విషయంలో తామంటే తామే ముందున్నామని.. పప్రచారం చేసుకుంటు న్న రెండు తెలుగు రాష్ట్రాలు వాస్తవానికి వెనుకబడ్డాయంటే ఆశ్చర్యం అనిపించకమానదు. కానీ, ఇది నిజం. దేశంలోని కీలకమైన 20 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై `ఇండియా టుడే` సంస్థ తాజాగా సర్వే చేసింది.
ఈ క్రమంలో అత్యుత్తమ పనితీరు చూపించిన రాష్ట్రాలకు ర్యాంకులు కూడా ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పెద్దగా ప్రబావం చూపించలేక పోవడం గమనార్హం. ఏపీ 8వ స్థానంలోనూ.. తెలంగాణ 11వ స్థానంలోను ఉండడం గమనార్హం. ఇండియా టుడే వరుసగా నాలుగో ఏడాది ప్రకటించిన ఈ ర్యాంకుల్లో తమిళనాడు అగ్రస్ధానంలో నిలిచింది.
2018 నుంచి వరుసగా తమిళనాడు ప్రజలకు అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు సాధించడం గమనార్హం. సాధారణ పరిపాలన, ఆర్దిక, విద్య, ఆరోగ్యం, శాంతి భద్రతలు వంటి కీలక అంశాల్లో ఆయా రాష్ట్రాల పాలనను ఆధారంగా చేసుకుని ఇండియా టుడే ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో తమిళనాడు తొలిస్థానంలో ఉండగా 2వ స్ధానంలో హిమాచల్ ప్రదేశ్, 3వ స్థానంలో కేరళ నిలిచాయి.
తమిళనాడుకు ఈ జాబితాలో మొత్తం 2080 పాయింట్లకు గానూ 1321.5 పాయింట్లు దక్కాయి. రెండో స్ధానంలో నిలిచిన హిమాచల్ ప్రదేశ్ కు 1312.5 పాయింట్లు లభించగా, 3వ స్ధానంలో ఉన్న కేరళ 1263.5 పాయింట్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ 1172.9 పాయింట్లతో 8వ స్దానంలోనూ, 1133.3 పాయింట్లతో తెలంగాణ 11వ స్ధానంలోనూ నిలిచాయి. మరి దీనిని బట్టి..రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు తమ ``సుపరిపాలన`` ఏతీరుగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.