Begin typing your search above and press return to search.
మగ ప్రొఫెసర్లకు వద్దకు వెళ్తే మార్కులు-లేడీ లెక్చరర్
By: Tupaki Desk | 17 April 2018 10:17 AM GMTవిద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్ విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం...ఆ విద్యార్థులు తమ ఆవేదనలో మొదట్లో తమలోనే దాచుకున్నప్పటికీ..అనంతరం శృతిమించడంతో ఇతరులకు పంచుకోవడం..దీనిపై ఉద్యమించిన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులో మ్యాథ్స్ బోదించే మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. కాలేజీలో నలుగురు అమ్మాయిల్ని శృంగారంలోకి దించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విరుద్దానగర్ జిల్లాలోని దేవాంగ ఆర్ట్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.
చెన్నైలోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టైలోని దేవాంగ ఆర్ట్స్ కళాశాలలో మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మదురై యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులకు ‘సన్నిహితంగా’ మెలగాల్సిందిగా, డిగ్రీ పట్టాలు కావాలంటే అధికారుల సెక్స్ కోర్కెలు తీర్చాలని ప్రొఫెసర్ నిర్మలాదేవి నలుగురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఫోన్‌లో ఓ ఆడియో మెసేజ్‌ను పంపించింది. ఆ ఆడియో మెసేజ్‌ను విద్యార్థులు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది. మధురై కామరాజ్ అధికారుల కోర్కెలు తీరిస్తే, డిగ్రీ పట్టాలతో పాటు ఆర్థిక లాభాలు కూడా జరుగుతాయని ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఈ చర్చలకు సంబంధించిన ఆడియో వాట్సాప్‌లో వైరల్ అవడంతో ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ విచారణకు ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడింది నిజమేనని, వాట్సాప్‌లో వైరలైనది తన గొంతుకనే అని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని, కొన్ని మాటలను కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు. తమ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మధురై కామరాజ్ వర్సిటీ వీసీ ఆరోపించారు. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం క్షమించరాని నేరమని, ఇలాంటి వారిని ఎన్‌కౌంటర్ చేయాలని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ తెలిపారు.