Begin typing your search above and press return to search.
నగ్నంగా వీధుల్లోకి వచ్చి - గొంతు కొరికి వృద్ధురాలిని చంపిన కరోనా రోగి
By: Tupaki Desk | 28 March 2020 3:09 PM GMTకరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది జనాలు ఇంటికే పరిమితమయ్యారు. పాజిటివ్ వస్తే క్వారంటైన్ లో ఉంటున్నారు. అనుమానితులు కూడా ఐజోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. చాలారోజుల పాటు ఇంటికే పరిమితం కావడం వల్ల ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. తమిళనాడులోని తేని జిల్లాలో 34 ఏళ్ల వ్యక్తి క్వారంటైన్ లో ఉన్నాడు. అతను నిన్న బయటకు పరుగెత్తుకొచ్చి 90 ఏళ్ల వృద్ధురాలి గొంతు కొరికాడు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.
క్వారంటైన్‌లో ఉన్న సదరు వ్యక్తి శ్రీలంక నుండి వారం క్రితం వచ్చాడని - అతను హోమ్ క్వారంటైన్ కావడంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాడని పోలీసులు వెల్లడించారు. అతను టెక్స్ టైల్ ట్రేడర్ అని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి అతడు ఇంటిలో నుండి నగ్నంగానే పరుగెత్తి కెళ్లి - నచ్చిమ్మల్ అనే వృద్ధురాలి గొంతును కొరికాడని - ఆ సమయంలో ఆమె బయట నిద్రిస్తోందని తెలిపారు.
తన గొంతును కొరకడంతో ఆ వృద్ధురాలు పెద్దగా ఏడుపు లంఘించుకుందని - చుట్టుపక్కల వారు విని అక్కడకు చేరుకొని - ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు. కానీ తేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతను మానసిక సమతౌల్యం కోల్పోయి - ఉన్మాదిలా మారాడని - జాంబీ సినిమాలో వైరస్ సోకినవాళ్లు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా చేశాడన్నారు.