Begin typing your search above and press return to search.
ఆ రెడ్డిగారు ఇచ్చిన లంచం 400 కోట్లు
By: Tupaki Desk | 8 May 2017 9:51 AM GMTటీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న చెన్నైకి చెందిన కాంట్రాక్టర్ పెద్ద నోట్ల రద్దు అనంతరం సాగిన ఐటీ దాడులు అనూహ్యమైన రీతిలో వెలుగులోకి వచ్చిన నగదు గుర్తుండే ఉంటుంది. టీనగర్ లోని శేఖర్ రెడ్డి ఇంట్లో సాగిన దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో అనేక కీలక ఆధారాలు, లెక్కలోకి రాని నగదు, డైరీలు ఐటీ వర్గాలకు చిక్కాయి. ఇందులో ఓ డైరీలో కాంట్రాక్టర్ గా తాను పొందిన లబ్ధికి ప్రతిఫలంగా కమీషన్లు పొందిన వారి వివరాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పలువురు మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల పేర్లుకూడా ఉన్న వివరాలు చర్చకు దారి తీశాయి. అయితే ఇందులో శేఖర్ రెడ్డి ఇచ్చిన లంచాల విలువ దిమ్మతిరిగే విధంగా ఉందంటున్నారు.
శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన డైరీలోని లెక్కల ఆధారంగా ఏకంగా రూ. 400 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను శాఖ తేల్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలు పేర్కొంటూ ఐటీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేకెత్తుతోంది. ఈ మంత్రులు ఎవరనే చర్చ సాగుతోంది. ఆ డైరీలోని కమీషన్లు, అవినీతి చిట్టాలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉండడం, ఏసీబీని రంగంలోకి దించే రీతిలో సూచనలు ఆ లేఖలో పేర్కొని ఉండడంతో ఏం జరగనుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని స్పష్టం చేస్తూ, పరోక్షంగా అదే కుప్పకూలడం ఖాయం అన్నట్టుగా ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు సంధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయపన్ను లేఖాస్త్రంతో పళనిస్వామి ప్రభుత్వ మనుగడ మీద దెబ్బ తీస్తుందా అన్న చర్చ మొదలైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/