Begin typing your search above and press return to search.
టీడీపీ మంత్రి రోజా.. నోరుజారిన మంత్రి
By: Tupaki Desk | 13 April 2022 7:46 AM GMTఏపీ మంత్రిగా ఇటీవలే ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇప్పుడు ఏపీలో రాజకీయ గుర్తింపును సాధించారు. అంతేకాదు.. పక్కనున్న తమిళనాడుకు కూడా రోజా ఫేమ్ పాకింది.
అయితే తాజాగా తమిళనాడు మంత్రి వేలు.. రోజాను ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం వైరల్ అయ్యింది. కొద్దిసేపటికే ఆయన చేసిన వ్యాఖ్యలను గ్రహించి సరిదిద్దుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. వేలు తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగించారు. తన ప్రభుత్వం మంచి పనులను స్వయంగా ప్రశంసిస్తూ.. సీఎం ఎంకె స్టాలిన్‌ను కూడా కొనియాడారు. “ఎంకే స్టాలిన్ పాలనకు ఇతర రాష్ట్రాల నుండి చాలా ప్రశంసలను అందుకుంటోంది. సీఎం స్టాలిన్ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అభినందించారు’’ అని వేలు అన్నారు. అనంతరం ఏపీలో రోజా తెలుగుదేశం పార్టీ మంత్రి అని వ్యాఖ్యానించారు.
వేలు వ్యాఖ్యలపై అసెంబ్లీ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని రోజా వైసీపీకి చెందినదని.. తెలుగుదేశం పార్టీ కాదని వేలుకు స్పష్టం చేశారు. వేలు తన తప్పును గ్రహించి, రోజా రాజకీయ అనుబంధంపై తన ప్రకటనలను సరిదిద్దారు.
తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజాను ఇంకా టీడీపీ మంత్రిగానే ఆయన సంబోధించడంపై సెటైర్లు వెల్లువెత్తాయి. బహుశా రోజా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పార్టీలోనే ఉన్నారనే భ్రమలో వేలు ఉండవచ్చని పలువురు ఎద్దేవా చేశారు