Begin typing your search above and press return to search.
కరుణ మరణంతో జరిగే కీలక పరిణామం ఇదే
By: Tupaki Desk | 9 Aug 2018 11:04 AM GMTడీఎంకేను ఒంటి చేత్తో నడిపించిన కరుణానిధి తుది శ్వాస విడిచిన నేపథ్యంలో..కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. కొద్దికాలం క్రితం జయలలిత కన్నుమూయడం, తాజాగా కరుణానిధి తుది శ్వాస విడిచిన నేపథ్యంలో...వ్యక్తి కేంద్రంగా నడిచే తమిళనాడు రాజకీయాలకు ఇక తెరపడనుందా? అనే చర్చ సాగుతోంది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను పరిశీలిస్తే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలకు కరుణ కన్నుమూతతో ఫుల్ స్టాప్ పడనుందని పేర్కొన్నారు.
ఆసక్తికరమైనవే కాకుండా...వ్యక్తి ఆరాధానకు వేదిక అయిన తమిళ రాజకీయాలు అన్నాదురై - ఎంజీఆర్ - జయలలిత - కరుణానిధి చుట్టే దశాబ్దాల పాటు నడిచాయి. అన్నాదురై మరణం తర్వాత 1969లో తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన కరుణానిధి తర్వాత డీఎంకేలో పట్టు సాధించారు. దీంతో డీఎంకేలో కీలక నాయకుడిగా ఉన్న ఎంజీఆర్ బయటికి వచ్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు. తర్వాత తమిళనాడు రాజకీయాలు కరుణానిధి - ఎంజీఆర్ కేంద్రంగా నడిచాయి. 1987లో ఎంజీఆర్ మరణించాక ఏఐఏడీఎంకే పగ్గాలను జయలలిత చేపట్టారు. దీంతో మళ్లీ తమిళనాడు రాజకీయాలు జయలలిత - కరుణానిధి కేంద్రంగా నడిచాయి. దాదాపు 30 ఏళ్ల పాటు తమిళనాడు రాజకీయాలు కరుణానిధి - జయలలిత చుట్టే తిరిగాయి. అయితే 2016లో తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 75 రోజుల పాటు దవాఖానలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఇదే సమయంలో కరుణానిధి కూడా వృద్ధాప్య సమస్యలు - అనారోగ్యం కారణంగా ప్రజా జీవితానికి దూరమై ఇంటికి పరిమితమయ్యారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవిని ఏర్పాటు చేసి పార్టీ బాధ్యతలను తన కుమారుడు స్టాలిన్ కు అప్పగించారు. ఇప్పుడు కరణ భౌతికంగా కూడా లేకపోవటంతో.. ఇంతకాలం తమిళనాడు రాజకీయాలు వ్యక్తి కేంద్రంగా నడిచాయి. ఇప్పుడు ఆ సంప్రదాయం తెరమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.