Begin typing your search above and press return to search.

ఎన్‌కౌంటర్‌ హెరిటేజ్ వరకూ పాకింది!

By:  Tupaki Desk   |   10 April 2015 7:54 AM GMT
ఎన్‌కౌంటర్‌ హెరిటేజ్ వరకూ పాకింది!
X
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళుల మృతికి నిరసనలూ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ విషయం అమానుషమని, అమాయకులైన కూలీలపై తుపాకులతో దాడి చేశారని తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే అదను చూసుకుని ఏపీ బస్సులపై దాడికి కూడా దిగారు కొందరు నిరసన కారులు. ఇదే సమయంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మైలాపూర్‌లోని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందిన సంస్థ హెరిటేజ్ సూపర్ మార్కెట్ పైన కూడా దాడి చేశారు.
బైక్ పైన హెరిటేజ్ సూపర్ మార్కెట్ వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు సైన్ బోర్డులు పగలగొట్టి... రిజిస్టర్స్, కంప్యూటర్స్ లను ద్వంసం చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. సంస్థలపై దాడులు చేసే సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తుంది. అయినా ఇది ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు మధ్య విషయం... దీనికి హెరిటేజ్ కు ఏమిటి సంబందమో తెలియడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఇదే విషయంపై మద్రాసు హైకోర్టులో కొంతమంది న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా చేర్చుతూ జరిగిన సంఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞులైన వారు కోరుతున్నారు!