Begin typing your search above and press return to search.

రిసార్ట్‌కు శ‌శిక‌ళ‌...ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   11 Feb 2017 1:34 PM GMT
రిసార్ట్‌కు శ‌శిక‌ళ‌...ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు
X
అన్నాడీఎంకే పార్టీలోని అంతర్గ‌త రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముగ్గురు మ్రంతులు, తన మద్దతుదారులతో కలిసి భారీ కాన్వాయ్‌తో ఆమె రిసార్ట్‌కు చేరుకున్నారు. గవర్నర్ ఆదేశానుసారం పోలీసులు, రెవెన్యూ అధికారులు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల లెక్క తేల్చారు. రిసార్ట్స్‌లో కేవలం 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తేల్చింది. ఉన్న ఎమ్మెల్యేల్లోనూ 20 మంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అవకాశం వస్తే అసంతృప్త ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. తాము క్షేమంగా ఉన్నామంటూ ఎమ్మెల్యేల నుంచి రెవెన్యూ అధికారులు సంతకాలు తీసుకున్నారు. ఈ 20 మందిని బుజ్జగించే పనికి శశికళే స్వయంగా రంగంలోకి దిగింది.

కాగా, పార్టీలో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. గోల్డెన్ బే రిసార్ట్‌కు చేరుకున్న శశికళ భవిష్యత్ కార్యచరణపై తన మద్దతుదారు ఎమ్మెల్యేలను కలిసి చర్చించారు. శశికళ వర్గం మూడు మార్గాలను యోచిస్తున్నట్లు సమాచారం. శశికళపై కేసుల నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఎల్పీ లీడర్‌గా తెరపైకి సెంగొట్టాయన్‌ను తీసుకువచ్చే యోచనతో ఉన్నారు. తనకు సీఎంగా అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్లడం. ఆఖరి అస్త్రంగా జయ సమాధి దగ్గర శశికళ నిరాహార దీక్షకు దిగే అవకాశం ఉంది. ఈ ఎత్తుగ‌డ‌ల్లో భాగంగా గవర్నర్ విద్యాసాగర్‌రావు కలిసేందుకు ఆమె ఇప్పటికే లేఖ రాశారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకని పక్షంలో ఆమె రెండు మార్గాలను యోచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా ఢిల్లీ బయలుదేరనున్నారు. అక్కడ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ సైతం దొరకని పక్షంలో ఢిల్లీలో ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళనకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకని పక్షంలో జయ సమాధి వద్ద శశికళ తన మద్దతుదారు ఎమ్మెల్యేలతో నిరాహారదీక్ష చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతు దారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది. విద్యాశాఖ మంత్రి పాండ్యన్ ఇప్పటికే సెల్వంకు మద్దతు ప్రకటించగా తాజాగా పార్టీ కోశాధికారి దిండిగల్ శ్రీనివాసన్ సెల్వం వైపు వచ్చేశారు. శశికళ ఇటీవలే పన్నీర్ స్థానంలో శ్రీనివాసన్‌ను పార్టీ కోశాధికారిగా నియమించారు.