Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ లో ఆ పార్టీ విలీనం.. క్యూలో మరో మూడు పార్టీలు
By: Tupaki Desk | 5 Oct 2022 7:33 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత , సీఎం కేసీఆర్ అడుగులు జాతీయ స్థాయికి పడుతున్నాయి. బీఆర్ఎస్ అంటూ ప్రచారం సాగుతున్న పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనను ఈరోజు మధ్యాహ్నం 1.19 గంటలకు చేయనున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడ నేతలతో సమావేశమైన తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రకటన చేయబోతున్నారు.
ఇక కేసీఆర్ జాతీయ పార్టీ అలా పెట్టనే లేదు.. అప్పుడే ఈ పార్టీలో విలీనం చేసేందుకు పలు పార్టీలు ముందుకొచ్చాయి. బీఆర్ఎస్ లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ అనే పార్టీ ముందుకొచ్చింది. బుధవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో ఈ విలీన ప్రకటన చేయనున్నారు.
‘విడుదతలై చిరుతైగల్ కచ్చి’ అనే పార్టీ నుంచి చిదంబరం లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్ కు చేరుకున్నారు.
కాగా ఈ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు.
కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీలో తమిళ పార్టీనే కాదు.. విలీనానికి మరికొన్ని పార్టీలు ముందుకు వచ్చాయని సమాచారం. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్ఎస్ తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టకముందే చిన్నా చితకా పార్టీలన్నీ ఆయన పార్టీలో విలీనానికి అడుగులు వేస్తున్నాయి. జాతీయపార్టీగా తమను తాము గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధపడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.