Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల మ‌క్కెలు ఇర‌గొట్టుడు భాషేంది బాబు?

By:  Tupaki Desk   |   24 March 2018 10:40 AM GMT
త‌మ్ముళ్ల మ‌క్కెలు ఇర‌గొట్టుడు భాషేంది బాబు?
X
ఉత్సాహం ఉండాలి. కానీ.. దానికి ఒక ప‌రిమితి అవ‌స‌రం. ఉద్య‌మం పేరుతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం మంచిది కాదు. ప్ర‌త్య‌ర్థిని టార్గెట్ చేయాలే కానీ.. సొంతోళ్ల‌ను అస్స‌లు చిన్న‌బుచ్చ‌కూడ‌దు. తెలంగాణ ఉద్య‌మంలో చూస్తే.. కేసీఆర్ అనుస‌రించిన ఫార్ములా భిన్నంగా ఉంటుంది. ఓవైపు ఉద్య‌మ నేత‌ల్ని ప‌ల్లెత్తు మాట అన‌ని టీఆర్ఎస్ నేత‌లు.. ఉద్య‌మానికి గండికొట్టే వారిని.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పైవ్యూహాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేసేవారు. చివ‌రికి వారు నోరెత్తి మాట్లాడేందుకు సైతం వ‌ణికే ప‌రిస్థితి తెచ్చారు.

ఉద్య‌మం చేస్తే అలా చేయాలే కానీ.. వెనుకా ముందు చూసుకోకుండా.. స‌రైన వ్యూహం లేకుండా..ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ని తిట్టేయ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటే అస‌లు ల‌క్ష్యం ప‌క్క‌కు వెళ్లిపోవ‌ట‌మే కాదు.. కొత్త స‌మ‌స్య‌లు మీద‌కు రావ‌టం ఖాయం. తాజాగా ఇలాంటి ప‌రిస్థితే ఏపీలో నెల‌కొంది. మోడీతో ట‌ర్మ్స్ బాగున్నంత వ‌ర‌కూ హోదా మీద ఒక‌ర‌కంగా మాట్లాడిన తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు అందుకు భిన్నంగా హోదా గురించి మాట్లాడుతున్నారు.

హోదా కంటే ప్యాకేజీనే ముఖ్య‌మ‌న్న త‌మ్ముళ్లు.. ఇప్పుడు మాత్రం హోదా రాగం తీయ‌ట‌మే కాదు.. హోదా సాధ‌న కోసం మొద‌ట్నించి ఉద్య‌మిస్తున్న వారిని బాధ్య‌తారాహిత్యంతో విమ‌ర్శ‌లు చేయ‌టం ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఉద్య‌మం చేసే వేళ‌లో.. అంద‌రిని క‌లుపుకు వెళ్ల‌టం చాలా ముఖ్యం. ఎంత‌కూ వెంట రాని వారిని సున్నితంగా హెచ్చ‌రిస్తూ.. వారిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా చేయాలే కానీ..నేరుగా టార్గెట్ చేయ‌కూడ‌దు.

ఆ చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్.. సినీ న‌టుల గురించి ఎంత చుల‌క‌న‌గా మాట్లాడారో తెలిసిందే. అయితే.. ఈ విష‌యంపై బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో ఆయ‌న దారికి వ‌చ్చి సారీ చెప్పారు. ఈ వివాదం ముగిసిపోక ముందే మ‌రో నేత అంత‌కు మించిన బాధ్య‌తారాహిత్యంతో చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఈ తీరును ప్ర‌ముఖ సినీద‌ర్శ‌కుడు క‌మ్ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ త‌ప్పు ప‌ట్టారు. త‌న మ‌న‌సులోని మాట‌ల్ని.. నా ఆలోచ‌న పేరుతో వీడియో రూపంలో త‌యారు చేసి ఆన్ లైన్లో అప్ లోడ్ చేయ‌టం తెలిసిందే. తాజాగా ఆయ‌న తెలుగు త‌మ్ముళ్ల తీరును త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న ఉద్య‌మ వేగం ఇప్ప‌డిప్పుడే పెరుగుతోంద‌ని.. ఇలాంటి వేళ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్న అధికార‌ప‌క్ష నేత‌ల తీరును త‌ప్పు ప‌ట్టారు.

సంఘ‌విద్రోహ శ‌క్తులు కొంద‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని ఇలాంటివి చంద్ర‌బాబు నిలువ‌రించాల‌న్నారు. ఈ మ‌ధ్య‌న ఒక‌త‌ను చేసిన వ్యాఖ్య‌ల్ని గురించి ప్ర‌స్తావిస్తూ.. అత‌ని పేరును కూడా తాను ప్ర‌స్తావించాల‌ని అనుకోవ‌టం లేద‌ని.. అలా ప్ర‌స్తావించ‌టం ద్వారా అత‌న్ని పెద్ద‌వాడిగా చేయ‌టం ఇష్టం లేద‌న్నారు. పిచ్చి పిచ్చి భాష‌తో మాట్లాడుతున్నార‌ని.. మ‌క్కెలు ఇర‌గొడ‌తామంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

హోదాకు స‌పోర్ట్ చేయ‌కుంటే మ‌క్కెలు ఇర‌గొడ‌తాన‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. ఇదేమైనా ప‌ద్ద‌తా అని ప్ర‌శ్నించారు. ఉద్య‌మం జ‌రుగుతున్న‌ప్పుడు అంద‌రిని క‌లుపుకోవ‌టానికి ప్ర‌య‌త్నించాలే కానీ.. ఇలా నోరు ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్ట‌టం భావ్యం కాద‌న్నారు. నోరుంది క‌దా అని ఎవ‌ర్ని ప‌డితే వాళ్ల‌నుతిట్ట‌టం.. లేదంటే ప‌ద‌వులు ఇచ్చారు కాబ‌ట్టి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర పేరు సంపాదించ‌టానికి ఇలా తొత్తులుగా.. బానిస‌లుగా బ‌తికే వాళ్లంద‌రిని ద‌గ్గ‌ర‌కు తీయ‌టం వ‌ల్ల చంద్ర‌బాబుకు బ్యాడ్ నేమ్ వ‌స్తుంద‌న్నారు. మీరెందుకు ఇలా చేస్తున్నారో తెలీదు.. క‌నీసం ఇలాంటి వాళ్ల‌ను ఆపాల‌ని బాబుకు త‌మ్మారెడ్డి సూచించారు.

ఏపీ రాష్ట్రానికి తీసుకురావ‌టానికి తామంతా వెంట ఉంటామ‌ని.. అంతేకానీ.. ప్ర‌తిఒక్క‌రిని ట్రోలింగ్ చేయ‌టం.. బూతులు తిట్ట‌టం.. బ‌ద్నాష్ ల‌న‌టం.. వారంతా ప్ర‌భుత్వానికి ప్ర‌తినిధులుగా చెప్పుకోవ‌టం బాగోలేద‌న్నారు. తాను చెబుతున్న మాట‌లు చంద్ర‌బాబు వ‌ర‌కూ వ‌స్తే బాగుంటుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి